Site icon NTV Telugu

Godavari Floods: గోదావరి మళ్లీ ఉగ్రరూపం.. ఆరు జిల్లాలను అప్రమత్తం చేసిన ప్రభుత్వం..

Godavari Floods

Godavari Floods

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో.. మళ్లీ గోదావరిలో వరద పోటెత్తుతోంది.. ఇప్పటికే భద్రాచలం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు.. ఈ రాత్రికి గోదావరిలో వరద ప్రవాహం 50 అడుగులను కూడా దాటేస్తుందనే అంచనాలు ఉన్నాయి.. జులైలో భారీ వరదలు, వర్షాలతో అతలాకుతలమై.. ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ప్రాంతాల్లో మళ్లీ టెన్షన్‌ మొదలైంది… ఈ నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్‌ విపత్తలు నిర్వహణ సంస్థ.. ఆరు జిల్లాలను అప్రమత్తం చేసింది.. ఎగువ నుంచి వస్తున్న వరద, భారీవర్షాల నేపథ్యంలో గోదావరికి వరద ప్రవాహం చేరుతున్నందున.. ముందస్తుగా ప్రభావితం చూపే అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, ఏలూరు, భీమవరం జిల్లాల అధికారులను అప్రమత్తం చేసినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా. బీఆర్ అంబేద్కర్ తెలిపారు.

Read Also: Minister Jogi Ramesh: గోరంట్ల మాధవ్‌ను ట్రాప్ చేసిన చంద్రబాబు, లోకేష్ జైలుకే..!

మంగళవారం రాత్రి 7 గంటలకు ధవళేశ్వరం వద్ద ఇన్ ఫ్లో , ఔట్ ఫ్లో 7.74 లక్షల క్యూసెక్కులకు చేరిందని తెలిపారు.. వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ అధికారులకు సూచనలు ఇస్తున్నామన్న ఆయన.. ఇప్పటికే ప్రభావం చూపే జిల్లాల యంత్రంగాన్ని అప్రమత్తం చేశామన్నారు.. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలిని సూచించారు. సహాయక చర్యల్లో అధికారులకు సహకరించాలని, బోట్లు, మోటర్ బోట్లు, స్టీమర్లలతో నదిలో ప్రయాణించడం, వరద నీటిలో ఈతకు వెళ్లడం, చేపలు పట్టడం, స్నానాలకు వెళ్లడం లాంటివి చేయరాదని సూచించారు. మరోవైపు.. ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణా వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నందున ఏన్టీఆర్, కృష్ణా జిల్లాల లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ.

Exit mobile version