NTV Telugu Site icon

Love Tragedy: అందుకు ఒప్పుకోలేదని.. ప్రియుడిపై ప్రియురాలి తల్లి దాడి

Mother Attack On Boyfriend

Mother Attack On Boyfriend

Girl Mother Rihana Attacked Her Daughter Boyfriend With Knife In Anamayya District: ప్రేమ.. ఇది కుల, మత, వర్గ బేధాలను చూడదు. అవతల ఒక వ్యక్తి నచ్చితే చాలు.. వారికి దగ్గరయ్యేలా చేస్తుంది. చాలా ప్రేమకథల్లో కులాంతర, మతాంతర వివాహాలే ఉంటాయి. కానీ.. కొన్ని విషాదాంతంగా ముగిసిన కథలూ ఉన్నాయి. కుల, మత విషయాల్లో పెద్దలు అడ్డు చెప్పడంతో.. ప్రేమికులు విడిపోవాల్సి వస్తుంది. అప్పుడు వివాదాలు చోటు చేసుకోవడంతో పాటు నేరాలు, ఘోరాలూ జరుగుతాయి. సరిగ్గా ఇలాంటి ఘటనే ఒకటి తాజాగా వెలుగు చూసింది. తమ మతంలోని మారడానికి యువకుడు నిరాకరిస్తుండటంతో.. ప్రియురాలి తల్లి అతనిపై కత్తితో దాడి చేసింది. ఈ దాడిలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..

Rashmika Mandana : రణ్ బీర్ కపూర్ పై పొగడ్తల వర్షం కురిపించిన రష్మిక..

అన్నమయ్యలోని మదనపల్లె కురబలకోట (మం) చేనేత నగర్‌కు చెందిన రెడ్డి ప్రసాద్ అనే యువకుడు ఓ ముస్లిం యువతిని ప్రేమించాడు. తొలుత గుట్టుగా తమ ప్రేమ వ్యవహారాన్ని కొనసాగించిన ఈ ఇద్దరు.. పెద్దలని ఒప్పించి, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే.. యువతి తల్లి రిహానా మాత్రం ప్రసాద్‌కి ఓ కండీషన్ పెట్టింది. తమ మతాచారాలకు అనుగుణంగా.. మతం మారాలని చెప్పింది. తమ మతాన్ని అంగీకరిస్తేనే.. పెళ్లికి ఒప్పుకుంటానని తేల్చి చెప్పింది. అందుకు ప్రసాద్ ఒప్పుకోలేదు. మతం మారనని చెప్పాడు. ఇలా రిహానా తల్లి ఎన్నిసార్లు చెప్పినా.. అతడు మతం మారేదే లేదని చెప్తూ వచ్చాడు. దీంతో కోపాద్రిక్తురాలైన ప్రేయసి తల్లి.. ప్రసాద్‌పై కత్తితో దాడి చేసింది. దీంతో ఖంగుతిన్న ప్రసాద్.. ఎలాగోలా ఆమె నుంచి తప్పుంచుకొని పారిపోయాడు. గాయాలతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Revanth Reddy: ఆ ముగ్గురికి చెప్పకుండా చేరికలేవీ జరగవు.. విభేదాలపై రేవంత్ క్లారిటీ

Show comments