NTV Telugu Site icon

GBS Virus In AP: ఏపీలో జీపీఎస్ వైరస్ కేసులు నమోదు.. మంత్రి కీలక సూచనలు

Gbs

Gbs

GBS Virus In AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం 17 గులియన్ బర్రె సిండ్రోమ్ (జీబీఎస్) కేసులు నమోదు అయినట్లు వైద్యాధికారులు తెలిపారు. ఆరు జిల్లాల్లో ఈ జీబీఎస్ కేసులు నమోదు అయినట్టు గుర్తించారు. విజయనగరం, విజయవాడ, అనంతపురం జిల్లాలో ఒక్కో కేసు చొప్పున నమోదు కాగా, కాకినాడలో 4, గుంటూరు, విశాఖలలో 5 చోప్పున జీబీఎస్ కేసులను గుర్తించారు. లక్ష మందిలో ఒక్కరికి మాత్రమే జీబీఎస్ సిండ్రోమ్ వ్యాధి సోకుతుంది. రోగనిరోధక శక్తిని నశింప చేసేలా జీబీఎస్ సిండ్రోమ్ పని చేస్తుందని వైద్యులు పేర్కొన్నారు.

Read Also: Robinhood : ‘వేరెవర్‌ యూ గో’ అంటూ నితిన్.. మహేశ్ బాబు చేతుల మీదుగా ‘రాబిన్‌హుడ్‌’ సాంగ్ రిలీజ్..

ఇక, అతిగా ఇన్ఫెక్షన్లు, వాక్సిన్‌లు, సర్జరీలు, ట్రామా, జన్యుపరంగానూ జీబీఎస్ వ్యాధి వచ్చే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. కండరాల బలహీనత, తిమ్మిరి, నడవలేకపోవటం, మింగలేకపోవటం, శ్వాస ఆడకపోవటం లాంటి లక్షణాలతో జీబీఎస్ వ్యాధి లక్షణాలుగా సూచించారు. ఇంట్రా వీనస్ ఇమ్యూనో గ్లోబిన్ ఇంజెక్షన్ చేయించుకోవాలని వైద్యారోగ్యశాఖ పేర్కొనింది. రాష్ట్రవ్యాప్తంగా 8 వేల వ్యాక్సిన్లను అందుబాటులో ఉంచినట్టు అధికారులు చెప్పారు. ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచిత చికిత్సను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ఇక, జీబీఎస్ బాధితులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తెలిపారు. ఈ ఇంజెక్షన్లను తీసుకోకుండానే 80 శాతం మంది రికవరీ అయ్యారని వెల్లడించారు.