GAS Pipeline Blast: తిరుపతి జిల్లా నాయుడుపేట సమీపంలోని మేనకూరు పారిశ్రామికవాడ వద్ద గ్యాస్ పైప్‌లైన్ పేలుడు కలకలం సృష్టించింది.. గ్యాస్ పైప్‌లైన్ పేలడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రయోగాత్మకంగా ఇంటింటికి గ్యాస్ ను అందించేందుకు అదానీ కంపెనీకి చెందిన ఏజీ అండ్ పీ అనే కంపెనీ పైప్ లైన్ల నిర్మాణం చేపట్టింది.. ఇక, ఇందులో భాగంగా ట్రయల్ పద్ధతిలో గాలిని పైపుల్లో నింపుతుండగా ఒత్తిడికి తట్టుకోలేని పైపులు ఒకసారిగా పగిలాయని చెబుతున్నారు.. దీంతో భారీ శబ్దం రావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. పైపులను శుభ్రపరిచే ప్రక్రియలో భాగంగా గాలిని నింపుతుండగా పైపులు పగిలాయని పోలీసులు తెలిపారు.. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. అయితే, నాయుడుపేట మేనకూరు పారిశ్రామికవాడలో.. ఓ దాబా ముందు గ్యాస్ పైప్‌లైన్ పేలింది.. ఈ ఘటనలో 35 అడుగుల మేర రాళ్లు, మట్టి పైకి లేచాయట.. ఘటన స్థలంలో పెద్ద గొయ్యి ఏర్పడింది.. ఇంటింటికి గ్యాస్ కనెక్షన్ ఇచ్చేందుకు కేంద్రం కొత్తగా నిర్మిస్తున్న గ్యాస్ పైపులైన్‌లో ఈ పేలుడు సంభవించడంతో.. గ్యాస్ సంగతి ఏమో.. కానీ, ఇలాంటి ప్రమాదాలు లేకుండా చూడాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Read Also: Suresh Babu: సురేష్ బాబు, రానా మీద క్రిమినల్ కేసు నమోదు…
