Site icon NTV Telugu

TTD: తిరుమలలో ఇవాళే గరుడ సేవ.. భక్తులకు కీలక సూచనలు..

Ttd

Ttd

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో తిరుమలలో వైభవంగా సాగుతున్నాయి. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదోవ రోజు శ్రీవారు ఉదయం మోహిని అవతారంలో దర్శనం ఇవ్వనున్నారు.. ఇక, బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన గరుడ సేవ ఈ రోజే జరగనుంది. రాత్రి 7 గంటలకు గరుడ వాహనంపై భక్తులుకు దర్శనం ఇవ్వనున్నారు మలయప్పస్వామి.. ఇవాళ తిరుమలకు రానున్న సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ లలిత్.. శ్రీవారి గరుడ వాహన సేవలో పాల్గొననున్నారు.. ఈ వాహ‌న సేవ‌కు వచ్చే భ‌క్తులంద‌రికి దర్శనభాగ్యం కల్పించేందుకు పటిష్టచర్యలు చేపట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం.. భక్తులందరికీ వాహ‌న దర్శనం కల్పించేందుకు టీటీడీ విస్తృత ఏర్పాటు చేసిన‌ట్లు చేసింది.. తిరు మాడ వీధుల్లో హార‌తి పాయింట్లు, గ్యాల‌రీల‌ను ఈవో, డీఐజి ర‌వి ప్రకాష్‌, జిల్లా ఎస్పీ ప‌ర‌మేశ్వర్‌రెడ్డితో క‌లిసి ఇప్పటికే పరిశీలించారు.. ఈ ఏడాది దాదాపు 3 లక్షల మంది భక్తులకు శ్రీ‌వారి గ‌రుడ వాహ‌న దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.. ఇక, ఈ ఏడాది సౌత్ వెస్ట్ గేటు, నార్త్ వెస్ట్ గేటు, నార్త్ ఈస్ట్ గెట్ల వద్ద ఉన్న హారతి పాయింట్లలో హారతులకు బ‌దులు భక్తులను స్వామి వారి వాహ‌న సేవకు అనుమతించనుంది టీటీడీ.

Read Also: APPSC Notification: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. మరో నోటిఫికేషన్‌ విడుదల చేసిన ఏపీపీఎస్సీ

గరుడ సేవ కారణంగా ట్రాఫిక్ నియంత్రణా చర్యలు చేపట్టారు టీటీడీ అధికారులు. ఘాట్ రోడ్లలో రేపు మధ్యహ్నం వరకు ద్విచక్రవాహనాలు నిలిపివేస్తూ నిర్ణం తీసుకున్నారు.. నిన్నటి నుంచి అంటే సెప్టెంబర్ 30 మధ్యాహ్నం 12 గంటల నుంచి తిరుమలకు బైక్‌లు నిషేధించారు. అలాగే వాహనదారులు అంతా తిరుపతిలో నిర్దేశించిన అలిపిరి బస్ స్టాండ్ పాత చెక్ పెయింట్ ఇస్కాన్ గ్రౌండ్, మెడికల్ కాలేజి గ్రౌండ్, నెహ్రు మున్సిపల్ గ్రౌండ్‌లలో పార్కింగ్ చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. ఇవాళ తిరుమలకు వెళ్లే వాహనాలు ముందుగా ప్రీ పాసులు పోందాలని సూచించారు పోలీసులు.. తిరుమలకు విచ్చేసిన భక్తులందరికీ గరుడవాహన దర్శనభాగ్యం కల్పించేలా ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ.. గ్యాలరీల ద్వారా 2 లక్షల మంది భక్తులుకు.. హారతి పాయింట్ల వద్ద హరతులు రద్దు చేసి.. భక్తులును దర్శనానికి అనుమతించడం ద్వారా మరో 30 వేల మంది భక్తులకు శ్రీవారి దర్శనభాగ్యం కలగనుంది.. ఇక, శ్రీవారి ఆలయం ఎదుట గ్యాలరీల రీఫిల్లింగ్ ద్వారా మరో 25 వేల మంది భక్తులకు స్వామివారి వాహన సేవను ప్రత్యక్షంగా తిలకించే ఏర్పాట్లు చేసింది టీటీడీ.

Exit mobile version