NTV Telugu Site icon

Free Gas Cylinder: ఏపీ వ్యాప్తంగా ప్రారంభమైన ఉచిత గ్యాస్ బుకింగ్స్‌..

Gas

Gas

Free Gas Cylinder: ఉచిత గ్యాస్ సిలిండర్ల కోసం ఈరోజు ఉదయం 10 గంటల నుంచి బుకింగ్ స్టార్ట్ అయింది. రోజు వారీ కంటే మూడు రెట్లు ఎక్కువ మంది ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకుంటున్నారు‌. కొందరు గ్యాస్ కనెక్షన్ బుక్ తో పాటు తెల్లరేషన్ కార్డు, ఆధార్ కార్డు తీసుకుని గ్యాస్ కంపెనీల దగ్గర బుకింగ్ చేసుకునేందుకు క్యూ కట్టారు. తొలుత 833 రూపాయలు డబ్బులు చెల్లించి గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేస్తే 48 గంటల్లోపు వీరి ఖాతాల్లోకి డబ్బు జమ అవుతుందని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 31వ తేదీ దీపావళి పండుగ రోజు నుంచి ఉచిత గ్యాస్ కనెక్షన్ల పంపిణీ చేయనున్నారు. ప్రతి 4 నెలలకు ఒకటి చొప్పున ఏడాదికి 3 సిలిండర్లు ఫ్రీగా ఏపీ సర్కార్ ఇవ్వనుంది.

Read Also: Israel-Hamas War: నస్రల్లా వారసుడు వచ్చేశాడు.. హిజ్బుల్లా చీఫ్‌గా నయీం ఖాసిమ్ ఎన్నిక

కాగా, ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ పంపిణీ పథకం ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైందని ఏపీ ప్రభుత్వం తెలిపింది. శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు రేపు (బుధవారం) లాంఛనంగా మొదటి ఉచిత సిలిండర్‌ను పంపిణీ చేయనుండగా.. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత గ్యాస్ బుకింగ్‌ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.‍‌