Site icon NTV Telugu

సోము వీర్రాజు అల్లుడిపై ఫోర్జరీ కేసు

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అల్లుడు నరసింహం చిక్కుల్లో పడ్డారు. ఆయనపై పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు పోలీస్ స్టేషన్‌లో ఫోర్జరీ కేసు నమోదైంది. రాజమండ్రికి చెందిన గద్దె జయరామకృష్ణ, శ్రీవాణి దంపతుల ఆస్తులను ఫోర్జరీ సంతకాలతో బ్యాంకులో తాకట్టు పెట్టి నరసింహం లోన్ తీసుకున్నారని పోలీసులకు ఫిర్యాదు అందింది. 2018-19లో కొందరు బ్యాంకు సిబ్బంది సహకారంతో నరసింహం ఈ ఫ్రాడ్‌ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

Read Also: రూపాయి పంపి రూ.99వేలు పోగొట్టుకున్నాడు

కాగా సోము వీర్రాజు అల్లుడు నరసింహం లోన్ తీసుకున్నప్పుడు తాము ఢిల్లీలో ఉన్నామని… ఈ విషయం తమకు తెలియదని బాధితులు గద్దె జయరామకృష్ణ దంపతులు వాపోతున్నారు. అయితే లోన్ సొమ్ము తిరిగి చెల్లించాలంటూ తమకు బ్యాంకు నుంచి నోటీసులు రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని వారు వివరిస్తున్నారు. ఫోర్జరీ సంతకాలతో సుమారు రూ.15 కోట్ల మేర సోము వీర్రాజు అల్లుడు నరసింహం తీసుకున్నారని పోలీసులకు ఫిర్యాదు అందడంతో వారు విచారణ చేపట్టారు. ఈ మేరకు పోలీసులు ఐపీసీ 406, 419, 420, 465 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు.

Exit mobile version