ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో వాతావరణం మారిపోయింది.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది… అయితే, కర్నూలు జిల్లాలో పిడుగుపాటుకు నలుగురు బలి అయ్యారు.. ఆదోని మండలం కుప్పగల్‌లో పిడుగు పడి కనిగిని ఉరుకుంధమ్మ (33), కనిగిని లక్ష్మమ్మ (39) ఇద్దరు మహిళలు మృతిచెందారు.. ఇక, హోళగొంద మండలం వండవాగిలిలో పంట పొలం పనులు చేస్తుండగా పిడుగుపాటుకు తాయన్న, చంద్రన్న ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు విడిచారు.. అధిక ఉష్ణోగ్రతలతో కొట్టుమిట్టాడుతున్న ఏపీ వాసులకు చల్లని కబురుతో వర్షాలు కురుస్తున్నామ.. పిడుగుపాట్లు కర్నూలు జిల్లాలో విషాదాన్ని మిగిల్చాయి.
Read Also: TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూన్