Site icon NTV Telugu

Gummadi Kuthuhalamma Passed Away: మాజీ మంత్రి కుతూహలమ్మ ఇక లేరు..

Gummadi Kuthuhalamma

Gummadi Kuthuhalamma

Gummadi Kuthuhalamma Passed Away: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ స్పీకర్‌ గుమ్మడి కుతూహలమ్మ ఇవాళ ఉదయం కన్నుమూశారు.. ఆమె వయస్సు 73 సంవత్సరాలు.. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆమె.. ఇవాళ తెల్లవారుజామున తిరుపతిలోని తన నివాసంలో కన్నుమూశారు.. 1949 జూన్‌ 1వ తేదీన ప్రకాశం జిల్లా కందుకూరులో జన్మించిన ఆమె.. ఎంబీబీఎస్‌ పూర్తి చేశారు.. అనంతరం కొంతకాలం వైద్య వృత్తిలో కొనసాగారు.. 1979 నుండి 1981 వరకు డాక్టర్స్ సెల్ కన్వీనర్ గా పనిచేసిన ఆమె.. రాజకీయాల్లో అంచలంచలుగా ఎదిగారు.. 1979లో కాంగ్రెస్ పార్టీలో చేరడం ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కుతూహలమ్మ.. చిత్తూరు జిల్లా యూత్ కాంగ్రెస్ కార్యకర్తగా పని చేశారు.. ఇక, 1980 – 1985లో చిత్తూరు జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌గా, కో- ఆప్షన్ సభ్యురాలిగా సేవలందించారు.. మరోవైపు.. 1985లో వేపంజేరి నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.

Read Also: Infosys: ఇన్ఫోసిస్ రాకకు ముహూర్తం ఖరారు.. విశాఖలో కార్యాకలాపాలు ప్రారంభించనున్న ఐటీ దిగ్గజం..

అయితే, రాష్ట్ర విభజన అనంతరం 20214లో కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పిన కుతూహలమ్మ.. టీడీపీలో చేరారు.. 2014లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓడిపోయారు.. ఇక, రాజకీయాల్లో వివిధ హోదాల్లో, ప్రజాప్రతినిధిగా వివిధ హోదాల్లో ఏఏ సమయంలో కుతూహలమ్మ పనిచేసేశారు అనే విషయాల్లోకి వెళ్తే.. 1980-1983 చిత్తూర్ జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్, 1985-1989 ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సభ్యురాలు, 1987-1994 ,ఆంధ్రప్రదేశ్ మహిళ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, 1991 – 1992 వైద్యారోగ్య శాఖ మంత్రి, 1992-1997 ఏఐసీసీ సభ్యురాలు, 1992-1993 మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి, 1998-2006 ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యురాలు,1999-2003 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యురాలు, 2001-2004 ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎలక్షన్ కమిటీ సభ్యురాలు, 24 జులై 2007 నుండి 19 మే 2009 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా సేవలు అందించారు. ఇక, కుతూహలమ్మ మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.. ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు.

Exit mobile version