NTV Telugu Site icon

మగబిడ్డకు జన్మనిచ్చిన టీడీపీ మాజీ మంత్రి

టీడీపీ మాజీ మంత్రి, కర్నూలు జిల్లా నాయకురాలు భూమా అఖిలప్రియ గురువారం నాడు మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ మేరకు భూమా అఖిలప్రియ తన బిడ్డతో ఉన్న ఫోటోను షేర్ చేశారు. భూమా అఖిల ప్రియ తన తల్లి శోభానాగిరెడ్డి జయంతి రోజునే మగబిడ్డకు జన్మనివ్వడం గమనార్హం.

Read Also: ఏపీ పాలనా రాజధానిపై మంత్రి కీలక వ్యాఖ్యలు

తల్లి శోభానాగిరెడ్డి మరణంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అఖిలప్రియ 2014లో వైసీపీ తరఫున ఆళ్లగడ్డ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో తండ్రి భూమా నాగిరెడ్డి నంద్యాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే కొన్ని రాజకీయ పరిణామాల వల్ల భూమా నాగిరెడ్డి, అఖిలప్రియ ఇద్దరూ టీడీపీలో చేరారు. అనంతరం భూమా నాగిరెడ్డి మరణించిన తర్వాత అఖిలప్రియకు మంత్రి పదవి దక్కింది. మంత్రిగా ఉన్న సమయంలోనే ఆమె భార్గవ్ రామ్‌ను పెళ్లి చేసుకున్నారు. అయితే 2019 ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి పోటీచేసిన అఖిలప్రియ ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్‌రామ్‌పై భూవివాదం కేసులు నడుస్తున్నాయి.