Anil Kumar Yadav: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ రాదనే భయంతో ఉన్నవారే తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారంటూ మండిపడ్డారు మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు ఎమ్మెల్యేలో అనిల్ కుమార్ యాదవ్.. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. నెల్లూరు నగర ప్రజలపై మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణ 11 వందల కోట్లు అప్పు పెడితే.. మేం అప్పు లేకుండానే అభివృద్ది చేస్తున్నాం అన్నారు.. గత ప్రభుత్వంలో ఏమి అభివృద్ది చేశారో చెప్పుకునే ధైర్యం టీడీపీ నేతలకు ఉందా..? అని సవాల్ చేసిన ఆయన.. సిటీ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై టీడీపీ నాయకులతో బహిరంగ చర్చకు నేను సిద్ధం అని.. నెల్లూరు సిటీ నుంచి మాజీమంత్రి నారాయణ పోటీ చేసినా.. నేను రెడీ అంటూ ఓపెన్ ఛాలెంజ్ చేశారు అనిల్ కుమార్ యాదవ్.
Read Also: Deputy CM Narayana Swamy: డిప్యూటీ సీఎం నారాయణస్వామికి నిరసన సెగ.. వాగ్వాదానికి దిగిన మహిళ
అయితే, వైసీపీలో టిక్కెట్ రాని వాళ్లే టీడీపీలోకి వెళ్తున్నారని ఆరోపించారు అనిల్ కుమార్ యాదవ్.. అలాంటివాళ్లు టీడీపీలోకి వెళ్ళక ఏం చేస్తారు..? అంటూ ఎద్దేవా చేశారు.. రక్తం మరిగినవాళ్లు అధికారం కోసం ఎంతటి అడ్డదారులలైనా తొక్కుతారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. కాగా, నెల్లూరు జిల్లా రాజకీయాలు ఏపీలో హీట్ పెంచుతున్న విషయం విదితమే.. ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందే.. పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్సీ కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మరో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి.. ఇక, ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అనూహ్యంగా విజయం సాధించిన తర్వాత వైసీపీ ముగ్గురు ఎమ్మెల్యేలపై వేటు వేయగా.. అందులో నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఇద్దరు ఉన్న సంగతి తెలిసిందే.
