కుప్పంలో ఉద్రిక్తత…మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి అరెస్ట్ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కుప్పం వేదికగా ఏపీ పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. చంద్రబాబు సొంత నియోజకవర్గంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలను అధికార, విపక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ సందర్భంగా జరిగిన గొడవతో టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. నేతలు ప్రచారం చేయకుండా అధికార పార్టీ కుట్రలు చేస్తోందంటూ.. డీజీపీకి లేఖ రాశారు చంద్రబాబు. కుప్పంలో టీడీపీ నేతలను అరెస్ట్ చేశారు పోలీసులు.
మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, చిత్తూరు టీడీపీ అధ్యక్షుడు నానిలను అదుపులోకి తీసుకున్నారు. కుప్పం మున్సిపల్ ఆఫీస్ వద్ద జరిగిన ఘటనలో 19 మంది టీడీపీ నేతలపై కేసు నమోదు చేశారు పోలీసులు. దీంతో కొంత మందిని అరెస్ట్ చేయగా, తాజాగా కుప్పంలోని ఓ హోటల్లో బస చేసిన అమర్నాథ్ రెడ్డి, నానిలను అదుపులోకి తీసుకున్నారు. కుప్పం మున్సిపల్ పోరులో నామినేషన్లు విత్ డ్రా సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. నామినేషన్ విత్ డ్రా గడువు ముగిసినా, తుది జాబితా ప్రకటించలేదని టీడీపీ నేతలు ధర్నాకు దిగారు.
Also Read
- Bandi Sanjay: బీఆర్ఎస్తో బీజేపీ ఎప్పుడూ పొత్తు పెట్టుకోలేదు..!
- OTR: ఏలూరు కూటమిలో రగులుతున్న కుమ్ములాటలు! నేతల మధ్య కోల్డ్ వార్!
- CM Chandrababu: రాష్ట్రంలో నీటి కొరతపై అలర్ట్.. ఎల్‌నినోపై ప్రజలకు సీఎం కీలక సూచనలు
- AP COVID-19 Cases: కరోనా వ్యాప్తిపై ఏపీ వైద్య ఆరోగ్యశాఖ కీలక ప్రకటన.. కేరళ టాప్.. ఏపీకి 8వ స్థానం..!
అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మొత్తం కుప్పం మున్సిపాలిటీ బరిలో టీడీపీ 126నామినేషన్లు, వైసీపీ 89 ,కాంగ్రెసు పార్టీ 15, బిజెపి తరపున ఐదుగురు నామినేషన్లు వేసారు. నామినేషన్ విత్ డ్రా గడువు ముగిసినా, రాత్రి తొమ్మిది వరకు తుది జాబితా ప్రకటించకపోవడంపై టీడీపీ నేతలు మున్సిపల్ ఆఫీసుకు చేరుకొని ధర్నా చేశారు. దీనిపై పోలీసులు కేసులు పెట్టి అరెస్ట్‌లు చేశారు. కుప్పంలో టీడీపీ నేతల అరెస్టుని చంద్రబాబు తప్పుబట్టారు. దీనిపై డీజీపీకి లేఖ రాశారు. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, పులివర్తి నానిలను అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. నేతల అరెస్టులతో టీడీపీ ప్రచారాన్ని అడ్డుకుంటున్నారని, దీనికి పోలీసులు సహకరిస్తున్నారని చంద్రబాబు లేఖలో తెలిపారు. తప్పుచేసిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Off The Record: పరకాల టికెట్ ఆశలు గల్లంతైనట్లేనా..! కొండా ఫ్యామిలీకి సీఎం బిగ్ షాక్?
-
Jharkhand: దిగొచ్చిన హేమంత్ సర్కార్.. విద్యార్థుల డిమాండ్లకు అంగీకారం!
-
OTR: నరసాపురంలో కాపుల అసంతృప్తికి అసలు కారణం ఇదేనా..?
-
Off The Record: వనపర్తి కాంగ్రెస్‌లో రగులుతున్న లొల్లి! ఎమ్మెల్యేను టార్గెట్ చేసిన చిన్నారెడ్డి
-
Vishnu Deo Sai: రైతుగా మారిన ముఖ్యమంత్రి.. పొలం దున్నిన విష్ణు దేవ్
ట్రెండింగ్
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్‌గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్‌బుక్‌లో చోటు.!
-
Coriander at Home: విత్తనాలు లేకుండానే కొత్తిమీర మొక్కలను పెంచండి ఇలా.. ఇక మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు.!
-
6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!