ఆస్పత్రిలో మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణ.. ఈరోజే సీఐడీ డెడ్‌లైన్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ ఇంట్లో ఏపీ సీఐడీ సోదాలు, నోటీసు వ్యవహారం చర్చగా మారింది.. ఇక, సోదాల సమయంలో పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.. విచారణ సందర్భంగా ఉద్వేగానికిలోనైన లక్ష్మీనారాయణ.. కళ్లు తిరిగి పడిపోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.. ఆ తర్వాత ఆయనను ఆసుపత్రికి తరలించారు. దాదాపు 10 గంటల పాటు సోదాలు నిర్వహించిన సీఐడీ అధికారులు.. 13వ తేదీ విచారణకు హాజరు కావాలంటూ నోటీసులిచ్చారు… అయితే, ప్రస్తుతం హైదరాబాద్‌లోని స్టార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు లక్ష్మీ నారాయణ.. అనారోగ్యంగా ఉండటంతో ఆస్పత్రిలో ఉండి చికిత్స తీసుకుంటున్నారు.. ఈ నెల 10వ తేదీన సీఐడీ తనిఖీల సందర్భంగా ఇంట్లో స్పృహ తప్పి పడిపోయాడు.. అధిక రక్తపోటుతో హాస్పిటల్‌కు తరలించారు.. ఈ రోజు విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసిన సీఐడీ పోలీసులు.. ఇక, ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు లక్ష్మీనారాయణ ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పరిశీలిస్తారని చెబుతున్నారు.. ఆయన ప్రస్తుత పరిస్థితిని పరిశీలించిన తర్వాతే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందంటున్నారు.. వైద్యులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తే ఆయన మంగళగిరిలోని సీఐడీ ఆఫీసుకు వెళ్లే అవకాశం ఉంది.
కాగా, చంద్రబాబు సర్కార్‌లో ప్రభుత్వ సలహాదారుగా పనిచేసిన లక్ష్మీనారాయణ.. నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా సేవలందించారు. అయితే.. లక్ష్మీనారాయణ పలు అక్రమాలకు పాల్పడ్డారని ఏపీ సీఐడీ అభియోగాలు మోపింది. ఇందులో భాగంగానే అధికారులు సోదాలు చేసింది.. నిధులు దుర్వినియోగం చేశారని.. ఆంధ్రప్రదేశ్ నైఫుణ్యాభివృద్ధి సంస్థ చేపట్టిన సీమెన్స్ ప్రాజెక్టుకు సంబంధించి 241 కోట్ల నిధులు దుర్వినియోగం అయ్యాయన్న ఆరోపణలపై.. సీఐడీ అధికారులు.. లక్ష్మీనారాయణతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా హైదరాబాద్‌లోని ఆయన ఇంట్లో సోదాలు చేశారు. చంద్రబాబు హయాంలో నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ, సీఈవోగా వ్యవహరించిన గంటా సుబ్బారావు ఫాంహౌస్‌లోనూ సోదాలు చేశారు. మరోవైపు సీఐడీ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారని లక్ష్మీనారాయణ ఇంట్లోని పనిమనుషులు ఆరోపించారు. సోదాల్లో భాగంగా హార్డ్ డిస్కు, కొన్ని పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. కొందరు సోదాలు చేస్తుండగా మరికొందరు లక్ష్మీనారాయణను ప్రశ్నించారు. ఈ క్రమంలో ఆయన ఉద్వేగానికి గురై ఒక్కసారిగా కింద పడిపోయారు. ఆ తర్వాత బంజారాహిల్స్‌లోని స్టార్ ఆసుపత్రికి తరలించారు. మరి లక్ష్మీనారాయణ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఏం చెబుతారు..? ఆయన సీఐడీ విచారణకు వెళ్తారా? లేదా? అనేది ఉత్కంఠగా మారింది.
Also Read
- AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
- CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు