YS Jagan: నేడు తాడేపల్లికి వైఎస్ జగన్.. ముఖ్య నేతలతో కీలక భేటీ..

  • నేడు బెంగళూరు నుంచి తాడేపల్లికి మాజీ సీఎం వైఎస్ జగన్..
  • ఉదయం 11.55కి గన్నవరం చేరుకోనున్న జగన్..
  • మధ్యాహ్నం 12.10కి తాడేపల్లి నివాసానికి వెళ్ళనున్న జగన్..
  • అందుబాటులో ఉన్న ముఖ్య నేతలతో సమావేశం కానున్న జగన్..
  • తాజా రాజకీయ అంశాలపై చర్చించే అవకాశం..
Jagan

Jagan

YS Jagan: బెంగళూరు నుంచి ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లికి రానున్నారు. ఉదయం 9.10 గంటలకు బెంగళూరులోని తన నివాసం నుంచి బయలుదేరి, 9.30 గంటలకు ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. ఆపై ఉదయం 10.15 గంటలకు విమానంలో బయలుదేరనున్న జగన్, ఉదయం 11.55 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ఇక, మధ్యాహ్నం 12.10 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి, 12.40 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. అనంతరం, అందుబాటులో ఉన్న వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం.