AP Govt: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేరళలోని వయనాడ్ బాధితుల కోసం 10 కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించింది. ఈ సందర్భంగా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ. 10 కోట్లను కేరళ ప్రభుత్వానికి ఇవాళ (శుక్రవారం) అందజేసింది. వయనాడ్‌లో జులై 30వ తేదీన కొండ చరియలు విరిగిపడిన ఘటనలో దాదాపు 310 మందికి పైగా మరణించగా వేల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వారిని
ఆదుకునేందుకుగాను ఆయా రాష్ట్రాలు స్పందించి తమకు తోచిన సహాయాన్ని అందజేస్తున్నాయి. ఇందుల్లో భాగంగా ఏపీలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం రూ. 10 కోట్ల విరాళాన్ని అందించింది.
Read Also: PM Modi: ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు మోడీ ఫోన్.. పశ్చిమాసియా ఉద్రిక్తతలపై చర్చ
ఇక, వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సైతం వయనాడ్ బాధితులకు ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు. ఇప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ప్రభాస్ రెండు కోట్లు, మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కోటి రూపాయలు, అల్లు అర్జున్ రూ. 25 లక్షలు, రష్మిక మందన్నా రూ.10 లక్షలు, నిర్మాత నాగ వంశీ రూ. 5 లక్షలతో పాటు ఇతర సెలబ్రిటీలు కేరళ రాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్ కు పెద్ద ఎత్తున విరాళాలు అందించారు. అలనాటి హీరోయిన్లు మీనా, కుష్బూ సుందర్, సుహాసినితో పాటు ఇతర సినీ తారలు నేరుగా వెళ్లి కోటి రూపాయల చెక్కును కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ కి అందజేశారు.
Aa
