Site icon NTV Telugu

Flower prices: అమాంతం ధరలు పెంచేసిన పువ్వుల వ్యాపారులు..

Flowers

Flowers

పండుగల సీజన్‌ వచ్చేస్తోంది.. ఒక్కరోజు దాటితే వినాయక చవితి.. ఆ తర్వాత దసరా.. ఇలాంటి సమయంలో.. పువ్వుల ధరలు అమాంతం పెరిగిపోయాయి.. పండుగల సీజన్ దగ్గర పడటంతో మార్కెట్ లో పువ్వుల ధరలు మండిపోతున్నాయని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. గతం కంటే రొండు రేట్లు అధిక ధరలకు వ్యాపారాలు పువ్వులు అమ్ముతున్నారని చెబుతున్నారు.. కేజీ మల్లెలు, సన్నజాజి పువ్వులు రూ. 400గా పలుకుతుండగా… చామంతి పువ్వులు కేజీ 250 రూపాయల పైమాటే అంటున్నారు.. ఇక, కనకాంబరం కేజీ రూ.1800గా అమ్ముతున్నారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.. గతంలో 50 రూపాయలు వుండే ఏ పువ్వులైన ఇప్పుడు 100 రూపాయలకు పైగానే అమ్మేస్తున్నారు వ్యాపారులు..

Read Also: Ganji Chiranjeevi: మొన్న టీడీపీకి షాక్‌.. నేడు వైసీపీ గూటికి..

అయితే, ఈ సమయంలో అటు రైతులకు కూడా పెద్దగా ధర పలకడం లేదట.. మధ్యవకర్తులు, వ్యాపారులే మాత్రమే.. అమాంతం పువ్వుల రేట్లను పెంచేశారట.. దీంతో, రిటైల్ కంటే రైతు మార్కెట్లో పువ్వులను కొనుగోలు చేసిందే బెటర్‌ అని చెబుతున్నారు విజయవాడ వాసులు.. సామాన్యులకు పువ్వులు ధరలు అందుబాటులో లేవంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. కాగా, ఈ నెల 31వ తేదీన వినాయక చవితి ఉంది.. తొమ్మిది రోజుల పాటు గణపయ్యను పూజించడానికి.. ప్రతీవిధుల్లో వినాయక మండపాలను ముస్తాబు చేయడానికి పువ్వులు, పత్రికి భారీగా డిమాండ్‌ ఉంటుంది.. ఈ నేపథ్యంలో ఆ డిమాండ్‌ను క్యాష్‌ చేసుకోవడానికి వ్యాపారులే.. పువ్వుల ధరలను పెంచేశారని మండిపడుతున్నారు భక్తులు.

Exit mobile version