Flood Victims leaving: బెజవాడ నగరం ఖాళీ అవుతుంది. బెజవాడ ముంపు ప్రాంతాల నుంచి బయట ప్రాంతాలకు వేలాది మంది తరలి వెళ్తున్నారు. నీటి ఉదృతి తగ్గటంతో కట్టు బట్టలతో ఇళ్లను వదిలి పెట్టీ వెళ్లిపోతున్నారు. విద్యుత్ సరఫరా, తాగు నీరు, ఫుడ్ అందక ఇళ్లను వదిలి వెళ్తున్నట్టు బాధితులు చెబుతున్నారు. ఇళ్లలో ఉండే పరిస్థితులు అసలు లేవని వరద ప్రాంత బాధితులు చెప్తున్నారు. అలాగే, వాహనాలు దొరకని వందల మంది కాలి నడకన బంధువులు, ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్న దృశ్యం కనిపిస్తుంది. చిన్న పిల్లలు పాలు లేక తిండి లేక ఇబ్బందులు పడ్డామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సింగ్ నగర్ నుంచి పాయకా పురం, కాండ్రిక, వాంబే కాలనీ పరిసర ప్రాంతాల నుంచి ముంపు బాధితులు తరలి వెళ్తున్నారు.
Read Also: Ashu Reddy : బ్రా లేకుండా అషు రెడ్డి అందాల విందు.. మామ ఇంతకంటే బోల్డ్ ఉంటుందా ?
కాగా, బుడమేరు వరద దెబ్బకు అజిత్ సింగ్ నగర్, కండ్రిక, పాయకాపురం, నున్న, వాంబే కాలనీ పరిసర ప్రాంతాల నుంచి ముంపు బాధితులు కట్టు బట్టలతో వెళ్తున్నారు. ట్రాక్టర్లు, బస్సులు, కాలి నడకన సైతం నగరం నుంచి వెళ్తున్నారు. 3 రోజులుగా నరకయాతన పడుతున్నామని బాధితులు ఆవేదన చెందుతున్నారు. చిన్న చిన్న పిల్లలు, పెంపుడు జంతువులతో నగరాన్ని వీడుతున్నారు. విజయవాడ వన్ టౌన్ ప్రాంతంలో ఎటు చూసినా వరద నీరు ఎవరిని కదిలించినా కన్నీరు కనిపిస్తుంది. రోజుల తరబడి ఇళ్లను వదిలిన వరద బాధితులు.. ఇప్పటికీ తిరిగి వచ్చే పరిస్థితులు కల్పించడం లేదు. ఇళ్లలో నీరు ఇంకా బయటికి వెళ్ళకపోవడంతో ఎక్కడ ఉండాలో అర్థం కాని పరిస్థితుల్లో వరద బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జ్యోజీనగర్ ప్రాంతంలో ఇళ్లల్లో చేరిన నీరు బయటకి పోవడానికి మరో మూడు నాలుగు రోజులు పట్టే అవకాశం కనిపిస్తోంది.