Site icon NTV Telugu

TDP Vs YCP: ఏలూరు జిల్లాలో బాబు టూర్.. టీడీపీ-వైసీపీ నేతల మధ్య ఫ్లెక్సీ వార్

Flexi War

Flexi War

TDP Vs YCP: ఏపీలో టీడీపీ మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బాదుడే బాదుడు తరహాలో ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ అనే పేరుతో మరో కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహాలను సిద్ధం చేసింది. ఈ మేరకు ఏలూరు జిల్లాలో బుధవారం నాడు టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. అయితే చంద్రబాబు పర్యటనకు ముందే వైసీపీ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. దీంతో ఏలూరు జిల్లాలో టీడీపీ, వైసీపీల మధ్య ఫ్లెక్సీ వార్ మొదలైంది. చంద్రబాబు పర్యటన సందర్భంగా టీడీపీ నేతలు ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ అంటూ దెందులూరు, చింతలపూడిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

Read Also: Kavitha Tweet: ఎమ్మెల్సీ కవిత సెటైరికల్ ట్వీట్.. షర్మిల, బీజేపీ టార్గెట్‌గా..

అయితే టీడీపీ నేతలకు పోటీగా ‘ఇదే మా అదృష్టం, చంద్రబాబు నువ్వే మా ఖర్మ’ అంటూ వైసీపీ నేతలు బ్యానర్లు ఏర్పాటు చేశారు. చింతలపూడిలో వీటిని వైసీపీ ఎమ్మెల్యే ఎలిజా ఫ్లెక్సీలు కట్టించారు. ఈ నేపథ్యంలో స్థానికంగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కాగా ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లా విజయరాయిలో జరిగే బహిరంగసభలో చంద్రబాబు పాల్గొననున్నారు. అక్కడి నుంచి వలసపల్లి క్రాస్‌ రోడ్‌ మీదుగా చింతలపూడి చేరుకుంటారు. చింతలపూడిలో రాత్రి 7గంటలకు జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి కొయ్యలగూడెం మండలం నరసన్నపాలెం వెళ్లి రాత్రికి చంద్రబాబు బస చేస్తారు.

Exit mobile version