NTV Telugu Site icon

Flexi Printers Association: ఫ్లెక్సీల నిషేధంపై ప్రభుత్వం పునరాలోచించాలి

Flex Printers

Flex Printers

Flex Printers Association: ఏపీలో నవంబర్ 1 నుంచి ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ఫ్లెక్స్ ప్రింటర్స్ అసోసియేషన్ వ్యతిరేకిస్తోంది. ప్రభుత్వ నిర్ణయంతో ఫ్లెక్సీ పరిశ్రమపై ఆధారపడ్డ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని అసోసియేషన్ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం తమను స్మగ్లర్లుగా చూస్తోందని.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల 10 లక్షల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని అసిసోయేషన్ ఆవేదన వ్యక్తం చేసింది.

Read Also: Ghulam Nabi Azad: పార్టీ పేరు, జెండాను ప్రకటించిన గులాం నబీ ఆజాద్‌.. పేరేంటో తెలుసా?

అటు ప్రభుత్వం జారీ చేసిన జీవోలో ఫ్లెక్సీల వల్ల ఎటువంటి అనర్ధాలు ఉన్నాయో వివరణ ఇవ్వలేదని ఆంధ్రప్రదేశ్ ఫ్లెక్స్ ప్రింటర్స్ అసోసియేషన్ వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయంపై తమకు ఇంకా సమయం కావాలని కోరింది. తమ పని వల్లే రాజకీయ నాయకులు ఎదిగారనే సంగతి గుర్తుంచుకోవాలని సూచించింది. పర్యావరణనికి తాము వ్యతిరేకం కాదని.. ఫ్లెక్స్ ప్రింటింగ్‌లో పని చేసే వ్యక్తులకు ఇప్పటివరకు ఒక్కరికి కూడా అనారోగ్య సమస్య లేదని వివరించింది. ఫ్లెక్సీలపై విధించిన నిషేధంపై ప్రభుత్వం పునరాలోచించాలని కోరింది.