AP Assembly: సభ నుంచి ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్
ఏపీ అసెంబ్లీలో సోమవారం గందరగోళం నెలకొంది. ప.గో. జిల్లా జంగారెడ్డిగూడెం సారా మరణాలపై టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. సభలో ప్రశ్నోత్తరాలు జరగకుండా అడ్డుకున్నారు. అనంతరం స్పీకర్ పోడియం చుట్టుముట్టి నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ తమ్మినేని కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ నుంచి ఐదుగురు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు, బాలవీరాంజనేయులును బడ్జెట్ సమావేశాలు ముగిసేంత వరకు సస్పెండ్ చేశారు. వారిని సభ నుంచి బయటకు తీసుకువెళ్లాలని మార్షల్స్‌ను ఆదేశించారు. దీంతో మార్చి 22 వరకు మళ్లీ సస్పెండ్ అయిన ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలు సభలోకి అడుగుపెట్టలేరు.
కాగా ఈ సస్పెన్షన్‌పై శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సభలో తీర్మానం ప్రవేశపెట్టగా.. మిగతా వైసీపీ సభ్యులు మద్దతు తెలిపారు. సస్పెండ్ అయిన తర్వాత కూడా ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలు సభ నుంచి బయటకు వెళ్లలేదు. అక్కడే తమ నిరసనను కొనసాగించారు. జంగారెడ్డి గూడెం మరణాలపై చర్చ చేపట్టాలని నినాదాలు చేశారు.
Also Read
- AP Liquor Scam Case: లిక్కర్ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట..
- Chandrababu warning: పార్టీ నేతలకు చంద్రబాబు క్లాస్.. తప్పులు చేస్తే హెడ్‌లైన్స్‌లోకి వెళ్తారు అంటూ హెచ్చరిక
- Chandrababu: తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది.. కార్యకర్తలు ఎప్పుడూ మీసం మెలేస్తారు.. ఎవ్వరికీ తలవంచరు..
- TDP నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం.. చంద్రబాబు ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం
తాజావార్తలు
-
Peddi: ‘టాక్సిక్’ అవుట్.. లైన్లోకి రామ్ చరణ్ ‘పెద్ది’!
-
Kerala Election Exit poll 2026: కేరళలో హస్తం హవా.. పినరయికి గుడ్ బై..
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Anand Deverakonda: ఈ కథ చెప్పినప్పుడు.. నా కథ నాకే చెప్పాడా అనిపించింది!
-
IPL 2026: అనూహ్య రీతిలో మెరిసిన భారత క్రికెట్ భవిష్యత్తు ఆశాకిరణాలు.. బీసీసీఐ దృష్టిలో ఈ 5 గురు..
ట్రెండింగ్
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్‌లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!