Site icon NTV Telugu

Coach Restaurant: రైల్వే స్టేషన్‌లో కోచ్ రెస్టారెంట్.. ఎక్కడో తెలుసా?

Railway Coach Restaurant

Railway Coach Restaurant

Coach Restaurant: ఇటీవల రెస్టారెంట్లు సాధారణంగా ఉంటే కస్టమర్లకు నచ్చడం లేదు. అందుకే ప్లాట్‌ఫామ్ రెస్టారెంట్, జైల్ రెస్టారెంట్ వంటి యాంబియెన్స్ ఉంటే అలాంటి రెస్టారెంట్లకు ఫుల్ డిమాండ్ ఉంటోంది. అందుకే దక్షిణ మధ్య రైల్వే వినూత్నంగా ఆలోచించి ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే కోచ్ రెస్టారెంట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గుంటూరు రైల్వేస్టేషన్ ప్రాంతంలో ఈ రెస్టారెంట్‌ను దక్షిణమధ్య రైల్వే అధికారులు ప్రారంభించారు. రైలు పట్టాలను ఏర్పాటు చేసి వాటిపై స్లీపర్ కోచ్‌ను పూర్తి ఏసీ సదుపాయంతో రెస్టారెంట్‌గా డిజైన్ చేశారు. ఏపీలో రైల్వే కోచ్ రెస్టారెంట్ ఇదే మొదటిది అని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.

Read Also: Army Dog Zoom: బుల్లెట్లు దూసుకెళ్లినా.. ఉగ్రవాదుల్ని చీల్చి చెండాడింది

కాగా ఈ రెస్టారెంట్‌లో రుచికరమైన ఆహారం దొరుకుతుందని.. రైలు ప్రయాణికులు, స్థానికులు ఎవరైనా ఈ రెస్టారెంట్‌లో రుచుల్ని ఆస్వాదించవచ్చని అధికారులు తెలిపారు. పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహారంతో ఈ రెస్టారెంట్‌లో విభిన్న వంటకాలతో కూడిన ప్రీమియం భోజన అనుభవాన్ని పొందవచ్చన్నారు. గుంటూరు రైల్వే స్టేషన్‌ మీదుగా ప్రయాణించే ప్రజల సౌలభ్యం కోసం ఈ రెస్టారెంట్‌లో 24 గంటల సేవలు అందుతాయని ప్రకటించారు. వాడుకలో లేని రైల్వే స్లీపర్ కోచ్‌ను ఇలా రెస్టారెంట్ కోసం ఉపయోగించామని.. ప్రయాణికులకు ఈ రెస్టారెంట్ నూతన అనుభవనాన్ని ఇస్తుందని డీఆర్ఎం మోహన్‌రాజా వెల్లడించారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు లైసెన్స్ మంజూరు చేయడం ద్వారా కోచ్ రెస్టారెంట్ కాన్సెప్ట్‌ను వివిధ ప్రాంతాల్లో అందుబాటులోకి తీసుకొస్తున్నామని పేర్కొన్నారు.

Exit mobile version