Site icon NTV Telugu

YSRCP Vs TDP: నగరిలో టెన్షన్.. టెన్షన్ …

Tdp Ycp

Tdp Ycp

మంత్రి ఆర్కే రోజా సొంత నియోజకవర్గం నగరిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. ఓ వైపు దివంగత నేత, మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతిని పురస్కరించుకుని అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు బ్యానర్లు, ఫ్లెక్సీలు కడితే.. మరో వైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహిస్తోన్న బాదుడే బాదుడు కార్యక్రమం సందర్భంగా పెద్ద ఎత్తున బ్యానర్లు, ఫ్లెక్సీలు పెట్టాయి టీడీపీ శ్రేణులు.. దీంతో.. నగరి టౌన్‌లో ఎటు చూసినా వైసీపీ వర్సెస్ టీడీపీ తరహాలో బ్యానర్లు, ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి.. ఇక, బ్యానర్ల ఏర్పాటు విషయంలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు వర్గాల ఘర్షణ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు అలెర్ట్‌ అయ్యారు.. మరి కాసేపట్లో నగరికి బాదుడే బాదుడు కార్యక్రమానికి చంద్రబాబు రానున్న నేపథ్యంలో.. ఎప్పుడు ఏమి జరుగుతుందోనన్న టెన్షన్‌లో భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు.

Read Also: Today Business Updates: ఇవాళ్టి బిజినెస్ వార్తల్లోని విశేషాలు

Exit mobile version