NTV Telugu Site icon

Andhra Pradesh: ఏపీలో తగ్గిపోయిన సంతానోత్పత్తి.. కారణం ఏంటి?

Fertility Rate

Fertility Rate

గతంలో ప్రతి దంపతులు ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలను కనేవాళ్లు. కానీ కొన్నేళ్ల నుంచి దంపతుల ఆలోచన విధానం మార్పులు వచ్చాయి. కేవలం ఇద్దరు లేదా ముగ్గురు చాలు అనుకుంటున్నారు. కొందరు అయితే ఒకరితోనే సరిపెట్టేస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా కుటుంబాల్లో పిల్లల సంఖ్య నానాటికీ తగ్గిపోతోంది. అయితే ఏపీలో కుటుంబ నియంత్రణ పాటిస్తున్న వారి సంఖ్య మరీ ఎక్కువైనట్లు కనిపిస్తోంది. ఈ విషయం జాతీయ ఆరోగ్య సర్వేలో వెల్లడైంది. ఏపీలో సగటున ప్రతి 10 కుటుంబాలకు 17 మందే పిల్లలు మాత్రమే ఉంటున్నారు.

జాతీయ ఆరోగ్య సర్వే ప్రకారం ఏపీలో సంతానోత్పత్తి రేటు 1.7గా నమోదైంది. ఇది 2015-16లో 2.2గా ఉండేది. జనాభా నియంత్రణకు గత కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వం కుటుంబ నియంత్రణ పథకాలు అమలు చేస్తోంది. సంతానం తగ్గించేందుకు ముందుకొచ్చే వారికి ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఈ విషయంలో వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బందికి లక్ష్యాలను నిర్దేశించింది. దీంతో 1992 నుంచి 1999 వరకు విస్తృత స్థాయిలో జరిగిన ప్రచారం వల్ల కుటుంబ నియంత్రణపై ప్రజల్లో అవగాహన పెరిగింది. దీని వల్ల సంతానం సంఖ్య క్రమంగా తగ్గింది. పేద కుటుంబాల్లో పిల్లల పోషణ భారం కావడం కూడా సంతానోత్పత్తి తగ్గడానికి కారణంగా కనిపిస్తోంది.

Visakhapatnam: పెళ్లి పీటలపైనే వధువు మృతిలో కొత్త కోణం..!

మరోవైపు దేశ వ్యాప్తంగా కూడా ఫెర్టిలిటీ రేటు దారుణంగా పడిపోయింది. దేశంలో ఫెర్టిలిటీ రేటు 2.2 నుంచి 2.0కు తగ్గిపోయినట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య స‌ర్వే త‌న నివేదిక‌లో స్పష్టం చేసింది. దేశంలో కేవలం ఐదు రాష్ట్రాల్లో మాత్రమే ఫెర్టిలిటీ రేటు 2 కంటే ఎక్కువగా నమోదైంది. బీహార్ (2.98), మేఘాల‌యా(2.91), ఉత్తర‌ప్రదేశ్‌(2.35), జార్ఖండ్‌(2.26), మ‌ణిపూర్‌(2.17) రాష్ట్రాలు ఈ జాబితాలో ఉన్నాయి.

అయితే దేశంలో జనాభా పరిమితి ఇంతకుమించి తగ్గకుండా చూడటం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే యువత సంఖ్య తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కుటుంబ నియంత్రణ చర్యలవల్ల 35 నుంచి 40 సంవత్సరాల వయసువారు తగ్గుతూ వస్తున్నారు. ఈ వయసువారు తగ్గడంతో పిల్లల సంఖ్య నానాటికీ తగ్గిపోతుండటం ఆందోళనకు గురిచేస్తోంది.

Show comments