NTV Telugu Site icon

భ‌క్తుల‌కు టీటీడీ షాక్‌… అలిపిరి టోల్‌గేట్ వ‌ద్ద ఫాస్ట్ ట్యాగ్ అమ‌లు…

తిరుమ‌ల వెళ్లే భ‌క్తుల‌కు టీటీడీ షాకింగ్ న్యూస్ చెప్పింది.  తిరుప‌తి అలిపిరి గేటు వ‌ద్ద ఏర్పాటు చేసిన టోల్ గేట్ వ‌ద్ద ఈ రోజు నుంచి ఫాస్ట్ ట్యాగ్ అమ‌లోకి తీసుకొస్తున్న‌ది.  ఈ రోజు నుంచి పెంచిన ధ‌ర‌లు ప్ర‌కారం అలిపిరి టోల్‌గేటు వద్ద చెల్లింపులు ఉండ‌నున్నాయి.  కార్ల‌కు రూ.50, బ‌స్సుల‌కు రూ.100 చోప్పున టీటీడీ వ‌సూలు చేయ‌బోతున్న‌ది.  అయితే, ద్విచ‌క్ర‌వాహ‌నాల‌కు మాత్రం ఎలాంటి వ‌సూళ్లు ఉండ‌వు.  ఇప్ప‌టికే రహ‌దారులపై ఏర్పాటు చేసిన టోల్ గేట్ల పెద్ద మొత్తంలో టోల్ ఫీజులు వ‌సూలు చేస్తున్నాయి.  ఇప్పుడు టీటీడీ కూడా అదే బాట‌లో న‌డుస్తుండ‌టంతో వాహ‌న‌దారులు ఆందోళ‌న వ్యక్తం చేస్తున్నారు.  క‌రోనా మ‌హమ్మారి కార‌ణంగా గ‌త కొంత కాలంగా తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకునే వారి సంఖ్య చాలా త‌క్కువ‌గా ఉంటోంది.  పైగా ఏపీలో మధ్యాహ్నం 12 గంట‌ల త‌రువాత క‌ర్ఫ్యూ అమ‌లులో ఉండ‌టం, స‌రిహ‌ద్దు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ఆంక్ష‌లు అమ‌లులో ఉండటంతో తిరుమ‌ల‌కు భ‌క్తుల తాకిడి భారీగా తగ్గింది.