Site icon NTV Telugu

Ap Fake Liquor Case: ఏపీ కల్తీ మద్యం కేసులో బిగ్ ట్విస్ట్..

Fake Liquor

Fake Liquor

Ap Fake Liquor Case: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేపిన కల్తీ మద్యం కేసు కొత్త మలుపు తీసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు జనార్ధన్ ఎక్సైజ్ పోలీసులకు షాక్ ఇచ్చాడు. జనార్ధన్ను అరెస్ట్ చేసిన తర్వాత ఆయన ఫోన్ గురించి ఆరా తీయగా.. ఆఫ్రికా నుంచి వస్తుండగా తన ఫోన్ ముంబైలోని ఎయిర్పోర్టులో పోయిందని తెలియజేశాడు. దీంతో జనార్ధన్ పేరుతో మరో సిమ్ తీసుకునేందుకు ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. జనార్ధన్ ఫోన్ కాల్ డేటాను కనుక్కోవడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

Read Also: Kurukshetra : ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఎండ్‌.. చివరి యుద్ధానికి కౌంట్‌డౌన్ మొదలైంది!

ఇక, నకిలీ మద్యం కేసులో A1గా ఉన్న జనార్ధన్ కి ఈ నెల 17వ తేదీ వరకు రిమాండ్ ను కోర్టు పొడిగించింది. దీంతో అతడ్ని నెల్లూరు సబ్ జైలుకి తరలించారు. అయితే, జనార్ధన్ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2021 నుంచి అక్రమ మద్యం వ్యాపారం చేస్తున్న జనార్ధన్.. ఏఎన్ఆర్ బార్ లో నష్టాలు రావడంతో నకిలీ మద్యం వ్యాపారంలోకి అడుగు పెట్టినట్లు తేలింది. మొదట హైదరాబాద్ నగరంలోని నిజాంపేట్ లో ఓ గది అద్దెకు తీసుకుని అక్కడి నుంచి అక్రమ మద్యం తరలించినట్లు తేలింది. అలాగే, నకిలీ ఇన్వాయిస్ లతో నిందితుడు జనార్ధన్ విజయవాడలోని ఇబ్రహీంపట్నంకు పంపించినట్లు పేర్కొన్నారు.

Exit mobile version