Eyeball Tattoo Goes Wrong: ప్రస్తుత కాలంలో యువత విభిన్నంగా కనిపించాలని రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. కానీ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జగదీష్ అనే యువకుడు చేసిన పని అందరినీ ఆశ్చర్యానికి, భయానికి గురిచేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే మొదటిసారిగా ఐబాల్ టాటూ (Eyeball Tattoo) వేయించుకున్న వ్యక్తిగా గుర్తింపు పొందాలని అతను తన కనుగుడ్లపై టాటూ వేయించుకున్నాడు.
Boti Curry Secrets: వాసన రాకుండా బోటి కూర ఇలా చేయండి.. రుచి అదుర్స్!
ఐటీఐ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన జగదీష్, ప్రస్తుతం టాటూ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్నాడు. టాటూలు, పియర్సింగ్ వంటి విభాగాల్లో నేపాల్‌లో శిక్షణ పొందాడు. చిన్నప్పటి నుండి ఏదైనా కొత్తగా, డిఫరెంట్‌గా చేయాలనే తపనతో అతను ఈ అత్యంత ప్రమాదకరమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. కంటిలో చిన్న నలుసు పడితేనే తట్టుకోలేము, అలాంటిది సూదులతో ఇంకును నేరుగా కంటి లేయర్లలోకి పంపడం అనేది వినడానికే భయంకరంగా ఉంది. ఈ టాటూ ప్రక్రియకు దాదాపు 3 నుండి 4 గంటల సమయం పడుతుంది. దీని కోసం జగదీష్ సుమారు రూ. 2 లక్షలు ఖర్చు చేశాడు (సాధారణంగా ఇది రూ. 5 లక్షల వరకు ఉంటుంది). నిపుణులు , వైద్యులు 50-50 శాతం ప్రమాదం ఉంటుందని, చూపు కోల్పోయే అవకాశం ఉందని హెచ్చరించినా అతను వెనక్కి తగ్గలేదు.
తల్లిదండ్రులకు చెప్పకుండా ఈ పని చేసిన జగదీష్‌ను చూసి అతని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. టాటూ వేయించుకున్న తర్వాత కనీసం మూడు నెలల పాటు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, లేకపోతే ఇన్ఫెక్షన్ సోకి చూపు శాశ్వతంగా పోయే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. ప్రత్యేక గుర్తింపు కోసం ఇలాంటి ప్రాణాంతకమైన ప్రయోగాలు చేయడం ఏమాత్రం శ్రేయస్కరం కాదని సామాజిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
AP Cabinet Key Decision: లడ్డూ కల్తీ వ్యవహారం.. అడ్మినిస్ట్రేటివ్ లోపాలపై ప్రత్యేక కమిటీ విచారణ
