Site icon NTV Telugu

వరదలతో ఏపీకి తీవ్ర నష్టం వాటిల్లింది: విజయసాయిరెడ్డి

వరదలతో ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర నష్టం వాటిల్లిందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితిపై రాజ్య సభలో ఎంపీ ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణ సాయం కింద రూ. వెయ్యి కోట్ల వరద సాయం ప్రకటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

వరదలతో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలలకు తీవ్రంగా నష్టం జరిగిందని, పెద్ద ఎత్తున ఆస్తి, పంట నష్టం జరిగిందని చెప్పారు. రోడ్లు, వంతెనలు, విద్యుత్‌ స్తంభాలు, కొట్టుకుపోయాయని సభకు తెలిపారు. వరదల్లో 44 మంది మృతి చెందారు. మరో 16మంది గల్లంతయ్యారు. ప్రాథమిక అంచనా మేరకు రూ. 6,054 కోట్ల పంట, ఆస్తినష్టం జరిగిందని రాజ్యసభలో విజయసాయిరెడ్డి వివరించారు. తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు.

Exit mobile version