ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం జూపూడి గ్రామంలో భారీ పేలుడు సంభవించింది. భారీ పేలుడు పదార్ధాలు ఇంట్లో ఉండటం వల్ల బ్లాస్ట్ జరిగినట్లు సమాచారం. ప్రమాదంలో ఓ ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. బ్లాస్టింగ్ సమయంలో ఇంట్లో వెల్డింగ్ వర్క్ జరుగుతున్నట్లు చెబుతున్నారు స్థానికులు. ప్రమాదం లో తీవ్రంగా గాయపడిన ముగ్గురు వ్యక్తులు.. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.