Ex-MLA Bhumana: పులికాట్ సరస్సులో ఫ్లెమింగో పక్షులకు శాశ్వత నివాసం కల్పించాలని డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యనించడం అభినందనీయం అని మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అన్నారు. మీ పేరులోనే పవనం, కళ్యాణం రెండు ఉన్నాయి.. సైబీరియా నుంచి వందల ఏళ్ల నుంచి వలస వస్తున్నాయి.. వందల ఏళ్ల దూరం ప్రయాణించి పులస చేపల్ని కూడా గోదావరిలో ఉండేటట్లుగా శాశ్వత నివాసం కల్పించాలని కోరుతున్నాం.. ఏప్రిల్, మే నెలల్లో శీతల వాతావరణం మీ అధీనంలో ఉంచుకుని రాష్ట్రంలో చల్లదనం శాశ్వతంగా ఉంచాలని కోరుతున్నామని భూమన అన్నారు.
Read Also: Bihar Elections 2025: మహిళలకు 30 వేలు, రైతులకు ఉచిత విద్యుత్.. తేజస్వి యాదవ్ వరాల జల్లు!
అయితే, సనాతన ధర్మ పరి పరిరక్షకులుగా మీరు ఇంకా ఎన్నో చేయాలి అని భూమన కరుణాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రమాదాలు జరగకుండా రాష్ట్రవ్యాప్తంగా రోడ్లు వేయాలి, దేవాలయాల్లో ప్రమాదాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలి, మద్యం మత్తులో అనర్థాలు జరగకుండా చూడాలని పేర్కొన్నారు. మీరు గాల్లో పక్షుల్ని, నీటిలో చేపల్ని కూడా మీ ఆధీనంలోకి తీసుకోవాలని అనుకోవడం అభినందనీయం అంటు వ్యంగ్రాస్త్రలు సంధించారు. ప్రకృతి ఆశించే శక్తి మీకు కలగాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నా.. ఇప్పటికే మీ జ్ఞాన తృష్ణ, ప్రజలకు అర్థం అయ్యింది అని కరుణాకర్ రెడ్డి సెటైర్లు వేశారు.