మాజీ మంత్రి, ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఈరోజు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీసులను అడ్డంపెట్టుకొని తమపై తప్పుడు కేసులు పెడుతున్నారని, తమను ఇబ్బందులు పెట్టి తప్పుడు కేసుల్లో ఇరికించాలని చూస్తున్నారని భూమా అఖిలప్రియ పేర్కొన్నారు. హైదరాబాద్ బోయినపల్లి కిడ్నాప్ కేసులో భూమా అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్, సోదరుడు జగద్విఖ్యాత్ రెడ్డిలపై మరోకేసు నమోదైంది. ఈ కేసుపై అఖిలప్రియ స్పందించారు.
Read: యూఎస్ నుంచి తిరిగొచ్చేసిన తలైవా
తమను ఇరికించేందుకే మరో కేసు పెట్టారని, ఎలాంటి భయం లేదని, తమ పోరాటం ఆస్తుల కోసం కాదని, హక్కుల కోసమే అని అఖిలప్రియ తెలిపారు. గతంలో కిడ్నాప్ కేసులో కోర్టుకు హాజరుకావాలని నోటీసులు వచ్చాయని, కోర్టుకు రెండుసార్లు హాజరయ్యామని, కానీ, పిటీషనర్లు హాజరుకాకపోవడంతో కేసు ఆలస్యం అవుతుందని అన్నారు. ఈ కేసులో వేరే వ్యక్తుల ప్రభావం ఉందని, తమపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నమే తప్ప, కేసులో వాస్తవాలు లేవని భూమా అఖిల ప్రియ పేర్కొన్నారు.