యూఎస్ నుంచి తిరిగొచ్చేసిన తలైవా

సూపర్ స్టార్ రజనీకాంత్ యూఎస్ నుంచి మళ్ళీ చెన్నైకి తిరిగొచ్చేశారు. ప్రస్తుతం ఆయన రాకకు సంబంధించిన పిక్స్ నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. జూన్ 19న తలైవా తన భార్యామణితో కలిసి చెన్నై నుంచి అమెరికాకు పయనమైన విషయం తెలిసిందే. రొటీన్ హెల్త్ చెకప్ కోసం ఆయన అమెరికాకు వెళ్లారు. ఫ్లోరిడాలోని మాయో క్లినిక్ వైద్య కేంద్రంలో ఆయన ఉన్న పిక్స్ బయటకొచ్చి హల్చల్ చేసిన విషయం తెలిసిందే.

Read Also : ‘భాయ్ జాన్’పై బిజినెస్ మ్యాన్ కేసు! కంప్లైంట్ లో సల్మాన్ చెల్లెలి పేరు కూడా…

తాజాగా ఆయన మళ్ళీ చెన్నైకి తిరిగొచ్చాడు. అర్ధరాత్రి చెన్నై విమానాశ్రయంలో ఆయన కనిపించడంతో అక్కడే ఉన్న ఆయన అభిమానులు తీసిన ఫోటోలు, వీడియోలు “తలైవా రిటర్న్స్” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందులో రజినీ నీలం రంగు చొక్కా, డెనిమ్ జీన్స్ టోపీ, వైట్ షూజ్ ధరించి కన్పిస్తున్నారు. ఇక ప్రస్తుతం తలైవా తన భారీ ప్రాజెక్ట్ “అన్నాత్తే” షూటింగ్ ను తిరిగి ప్రారంభించనున్నారు. త్వరలోనే రజినీకాంత్ తదుపరి ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రానుంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-