NTV Telugu Site icon

RK Roja: సుప్రీం కోర్టు తీర్పుపై మాజీ మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు..

Roja

Roja

తిరుపతి లడ్డూ వ్యవహారంలో సుప్రీం కోర్టు తీర్పుపై మాజీ మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. సిట్ విచారణ మొదట నుంచి తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. స్వలాభం కోసం చంద్రబాబు లడ్డూ కల్తీ అని ప్రకటన చేశారు.. సుప్రీం కోర్టు సరిగ్గా విచారణ చేస్తే చంద్రబాబు అబద్ధాలు బయటకు వస్తాయని అన్నారు. సీఎం స్థాయిలో ఉండి విచారణ చేయకుండా.. సాక్ష్యాధారాలు లేకుండా లడ్డూపై ప్రకటన చేశారు. జగన్ ఇబ్బంది పెట్టాలనే ఇలా చేశారని పేర్కొన్నారు. మరోవైపు.. సిట్‌ను హడావుడిగా ఏర్పాటు చేశారు.. ఈ సిట్‌పై తమకు నమ్మకం లేదన్నారు. ఇది వరకే చంద్రబాబు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో డీఐజీ స్థాయి అధికారితో సిట్ వల్ల నిజాలు బయటకు రావు.. సిబిఐకి ఇవ్వాలని తాము కోరుతున్నామని చెప్పారు. సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో ఈ విచారణ జరగాలని కోరారు. మరోవైపు.. లడ్డును తినాలా వద్దా అని భక్తులు అనుమానంతో ఉన్నారు.. లడ్డూ తినకుండా భక్తులు వెళ్ళిపోతుండడం తనకు చాలా బాధ వేసిందని చెప్పారు. తాను ఈరోజు తమిళనాడు అలఘర్ ఆలయంలో ఉన్నానని.. తప్పుడు ప్రకటన చేసిన వారికి శిక్ష పడాలని ఇక్కడ దేవుడుని వేడుకున్నానని రోజా అన్నారు.

Read Also: IND vs BAN: రెండో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్.. ఆధిక్యంలో టీమిండియా

టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. దేవుడ్ని వివాదాల్లో తీసుకుని రాకండని ఎంత చెప్పినా వినలేదు.. కేసు పెట్టకుండా, విచారణ జరపకుండా చంద్రబాబు మాట్లాడాడని అన్నారు. నాటుసారా తాగినా వ్యక్తి మాట్లాడినట్లూ సీఎంగా హోదాలో ఉంటూ అసత్యాలు మాట్లాడరని చెప్పారు. సుప్రీంకోర్టు సరైనా విధంగా ప్రశ్నించింది… దేవుడే సుప్రీంకోర్టుతో మాటలు పలికించారు‌.. నిజం ఎప్పటికి గెలుస్తుంది‌.. తప్పు చేయలేదు కాబట్టే ధైర్యంగా తాము విచారణ కోరామన్నారు‌‌. స్వామీ వారి వైభవాన్ని తగ్గించే విధంగా చంద్రబాబు, పవన్ మాట్లాడారు.‌‌. బాబు, పవన్‌లను హిందువులందరూ ఛీ కొడుతున్నారని ఆరోపించారు.

Read Also: Russia: హిజ్బుల్లా చీఫ్ నస్రల్లా మరణంపై రష్యా సంచలన ప్రకటన