Site icon NTV Telugu

M.Mareppa: జగన్ పాలనలో దళితులు, గిరిజనులకు అన్యాయం

Marepa

Marepa

ఏపీలో జగన్ పాలనపై మండిపడ్డారు మాజీ మంత్రి మారెప్ప. కుతుహులమ్మ మృతికి సంతాపం తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో దళితులు గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ఎస్సీ ఎస్టీల అభివృద్ది కోసం కేంద్రం ఇచ్చిన నిధులను జగన్మోహన్ రెడ్డి దారిమళ్ళిస్తున్నారు. దళిత ఉద్యోగులను కూడా ఏపీలో వేధిస్తున్నారు. దళిత గిరిజన కార్పొరేషన్ లకు నిధులు లేవు. గతంలో జీవో వన్ లాంటి జీవో లు ఉండుంటే నీవు ప్రజల్లో తిరిగి ఉండేవాడివా జగన్. అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం చేశాడు జగన్ అని మారెప్ప విమర్శించారు.

Read Also: Indian Idol Season 2: ఇండియన్ ఐడల్ తెలుగు సీజన్2 ఆరంభం

మూడు రాజధానులు అంటున్న ముఖ్యమంత్రి తనతో పాటు విజయ సాయి రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి లకు సీఎం పదవులు ఇస్తాడా? ఏపీ లో ప్రస్తుతం జగన్ పోవాలి పోవాలి అంటున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లోనే కాదు ఢిల్లీ లోని ఏపీ భవన్ లోనూ దళితులకు తీవ్ర అవమానం జరుగుతుంది. మాజీ మంత్రి అయిన నన్ను కూడా తీవ్రంగా అవమానించారని మారెప్ప విమర్శించారు.

Read Also: KA Paul: కేఏ పాల్ వార్నింగ్.. ఆమరణ నిరాహారదీక్ష చేపడతా

Exit mobile version