మాజీ మావోయిస్టు , ప్రముఖ కవి అనామధేయుడు అనుమానాస్పద స్థితిలో మరణించారు. విగత జీవిగా వున్న ఆయన మృతదేహాన్ని రాజమండ్రిలో గుర్తించారు. అనామధేయుడు మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు కుటుంబ సభ్యులు రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు. ప్రస్తుతం వైద్యులు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనామధేయుడు అసలు పేరు జేఎన్వీ మూర్తి. కృష్ణా జిల్లా గొల్లపూడి గ్రామానికి చెందిన మూర్తి విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో చదివే సమయంలోనే విప్లవ రాజకీయాలకు పరిచయమయ్యాయి. రాడికల్ విద్యార్థి సంఘంలో ఎక్కువ కాలం పనిచేశారు. అనంతరం పీపుల్స్ వార్ పార్టీలో చేరి విప్లవోద్యమంలో కీలకపాత్ర పోషించారు.
అనంతరకాలంలో అనారోగ్య కారణాలతో బయటకు వచ్చారు. అప్ప టికే కవిత్వం, ,కథలు రాస్తున్న అనామధేయుడు విప్లవ రచయితల సంఘంలో చేరి చురుకుగా వ్యవహరించారు. ఈ సంఘం అధికార పత్రిక అరుణతార పత్రిక నిర్వహణలో కీలక బాధ్యత వహించారు. జర్నలిస్ట్ గా వివిధ పత్రికల్లో పనిచేశారు. 1996లో ఒంగోలుకు చెందిన ప్రభుత్వ టీచరు క్రాంతితో ఈయనకు వివాహం జరిగింది. అనామధేయుడు పేరుతో పలు పత్రికల్లో వ్యాసాలు, రచనలు చేశారు.
Read Also: Sabitha Indra Reddy : సీఎం కేసీఆర్ విద్య, వైద్యానికి పెద్దపీట వేశారు
పలు పుస్తకాలు ప్రచురించారు. అనువాద కవిత్వం పట్ల మక్కువ చూపేవారని సన్నిహితులు గుర్తుచేసుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న అనామధేయుడు ఇటీవల వైజాగ్ వెళ్లినట్టు కుటుంబసభ్యులు చెబుతున్నారు. తణుకులో చదువుతున్న కుమార్తె నది వద్దకు వెళ్ళడానికి రాజమండ్రి వచ్చారు. ఇలా వచ్చిన అనామధేయుడు ఇన్నీసుపేట కైలాస భూమిలో విగతజీవుడై పడిఉండడాన్ని స్థానికులు గమనించారు. అనామధేయుడి ఫోన్లోని నంబర్ల ఆధారంగా కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యుల సహకారంతో అనామధేయుడని ధ్రువీకరించుకున్నారు. మృతదేహాన్ని రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Read Also: Dispute Over Missing Goats: తప్పిపోయిన మేకల విషయంలో వివాదం.. రైతును కాల్చిచంపేశాడు..