NTV Telugu Site icon

Ex-Husband Crime: మరో వ్యక్తితో మహిళ రాసలీలలు.. తట్టుకోలేక భర్త కిరాతక పని

Ex Husband Kills Wife

Ex Husband Kills Wife

Ex Husband Killed His Wife For Marrying Another Man: వాళ్లిద్దరు ప్రేమించి, మతాంతరం వివాహం చేసుకున్నారు. వారి ప్రేమకు గుర్తుకు ఒక కొడుకు కూడా పుట్టాడు. కానీ, ఆ తర్వాత చోటు చేసుకున్న కొన్ని అనుకోని ఘటనల వల్ల వాళ్లు విడిపోవాల్సి వచ్చింది. ఎవరి జీవితాల్లో వాళ్లు బిజీ కూడా అయిపోయారు. అయితే.. మరో వ్యక్తితో తన భార్య తిరుగుతుండడం చూసి భర్త తట్టుకోలేకపోయాడు. దీంతో అతడు కిరాతకంగా ఆమెను హతమార్చాడు. అనంతపురంలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. వజ్రకరూరుకు చెందిన తపాల్‌ బాబా, 17 ఏళ్ల క్రితం పెనకచెర్ల గ్రామానికి చెందిన లక్ష్మిని ప్రేమించి, మతాంతర వివాహం చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె తన పేరుని ఆషాబీగా మార్చుకుంది. వీరికి నూర్‌ మహమ్మద్‌ వలి (15) అనే కుమారుడు కూడా ఉన్నాడు.

Mans Belly Dance : ఏందిరయ్యా ఈ అరాచకం.. ఏదేమైనా సూపర్

పెళ్లైన కొత్తలో బాబా, ఆషాబీ దాంపత్య జీవితం సాఫీగానే సాగింది కానీ, ఆ తర్వాత బాబా శైలిలో మార్పు వచ్చింది. అతడు మద్యానికి బానిసయ్యాడు. రోజూ తాగి వచ్చి, భార్యతో గొడవ పడేవాడు. తాగుడు మానేయాలని భార్య ఎన్నిసార్లు చెప్పినా.. బాబాలో మార్పు రాలేదు. ఇక బాబాలో మార్పు రాదని అనుకున్న ఆషాబీ.. పెద్దల సమక్షంలో బాబాతో విడాకులు తీసుకుంది. విడాకుల అనంతరం భర్త వద్ద కొడుకుని వదిలేసి వెళ్లిపోయింది. కట్ చేస్తే.. కొన్నాళ్ల తర్వాత ఆషాబీకి నబీరసూల్‌తో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారి, పెళ్లిదాకా వెళ్లింది. నబీరసూల్‌కు అంతకుముందే ఒక భార్య ఉన్నప్పటికీ.. ఆషాబీ రెండో భార్యగా కొనసాగింది. వీళ్లు ఒక ఇళ్లు కట్టుకొని, అందులోనే కాపురం కూడా పెట్టారు. ఇలా ఆషాబీ జీవితం సాఫీగా సాగుతుంటే, బాబా మాత్రం మగ్గిపోతూ వస్తున్నాడు. తన భార్య మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండటాన్ని చూసి తట్టుకోలేకపోయాడు.

Extra Marital App: వివాహేతర బంధాలకు యాప్.. ఇదేం చోద్యం?

ఆ బాధలోనే ఆషాబీని చంపాలని పథకం వేశాడు. బుధవారం రాత్రి తన కొడుకుతో కలిసి.. ఆషాబీ ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో ఆషాబీ సోదరుడు రమేష్‌ డోర్ తీయగా.. అతనిపై కత్తితో దాడి చేశాడు. ఆ దెబ్బకు అతడు అక్కడే కూలిపోయాడు. ఆ వెంటనే బెడ్‌రూంలోకి వెళ్లి.. ఆషాబీపై బాబా విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. ఆమె మృతి చెందిందని నిర్ధారించుకున్నాక.. తన కొడుకుతో కలిసి అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు.. దాడిలో గాయపడ్డ ఆషాబీ సోదరుడు రమేశ్‌ని ఆసుపత్రిలో చేర్పించగా, అతడు కోలుకుంటున్నాడు.

Neeru Bajwa: అతడు నా సోదరి ఫ్రెండ్.. అతని వల్లే ఇలా అయ్యా

Show comments