Site icon NTV Telugu

Chandrababu Naidu: జగన్ హయాంలో పారిశ్రామిక ప్రమాదాల జోరు

Chandrababu (1)

Chandrababu (1)

విశాఖ అచ్యుతాపురంలోని ఓ పరిశ్రమలో జరిగిన ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు (Chandrababu Naidu). వైసీపీ ప్రభుత్వం వచ్చాక విశాఖలోని ఎల్‌జీ పాలిమర్స్‌ మొదలుకుని వరుసగా పారిశ్రామిక ప్రమాదాలు జరగడం, కార్మికులు బలవ్వడం సాధారణమైంది.కమిటీలు వేసి చేతులు దులుపుకుంటే సరిపోదు.

పరిశ్రమల్లో భద్రతా  ప్రమాణాలపై పర్యవేక్షణ ఉంటే ఇన్ని ప్రమాదాలు జరగవు, లోపం ప్రభుత్వంలోనే ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని పారిశ్రామిక ప్రమాదాలను నివారించాలి. మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలి. అచ్యుతాపురం సెజ్‌లోని సీడ్స్‌ వస్త్రపరిశ్రమలో ఇదే ఏడాది జూన్‌ 3న విషవాయువులు లీకై 469 మంది మహిళా కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

నాటి ప్రమాదంపై ప్రభుత్వం విచారణ కమిటీని నియమించినా ఇప్పటివరకు ప్రమాదానికి కారణాలేంటో కమిటీ చెప్పలేకపోయింది. అదే పరిశ్రమలో ఇప్పుడు మరోసారి వెలువడిన విషవాయువును పీల్చి దాదాపు 100 మంది మహిళా కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. అలాగే తూర్పుగోదావరి జిల్లాలోని దేవరపల్లి లోని బయోటెక్ మొక్కజొన్న ఫ్యాక్టరీలో బాయిలర్ క్లీన్ చేసే క్రమంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఏడాదే ఏప్రిల్ నెలలో ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెంలోని పోరస్‌ కర్మాగారంలో భారీ ప్రమాదం జరిగి ఆరుగురు కార్మికులు మరణించారు. ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని, పారిశ్రామిక వాడల్లో భద్రతా ప్రమాణాలు పాటించాలన్నారు.

Atchutapuram Gas Leak: గ్యాస్‌ లీక్‌ ఘటనపై సర్కార్‌ సీరియస్‌.. కంపెనీ మూసివేతకు ఆదేశాలు

Exit mobile version