Site icon NTV Telugu

Breaking: జేసీ ఇంట్లో ఈడీ సోదాలు..

Jc Prabhakar Reddy

Jc Prabhakar Reddy

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు ఈడీ అధికారులు.. జేసీ ప్రభాకర్‌రెడ్డి సహా ఆయన కుటుంబ సభ్యుల సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈడీ సోదాల సమయంలో ఇంట్లో ఉన్నారు మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డితో పాటు.. జేసీ ప్రభాకర్‌రెడ్డి. మరోవైపు… కాంట్రాక్టర్‌ చవ్వా గోపాలరెడ్డి ఇంట్లోనూ ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఇవాళ తెల్లవారుజామున జేసీ ఇంట్లోకి ప్రవేశించిన ఈడీ అధికారులు సోదాలు చేపట్టడంతో.. తాడిపత్రిలో కలకలం రేగుతోంది.. మరోవైపు, హైదరాబాద్‌లోనూ ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది.

Read Also: Gold Price Today: బ్యాడ్‌ న్యూస్‌.. భారీగా పెరిగిన బంగారం ధర

Exit mobile version