Site icon NTV Telugu

హైకోర్టుకు హాజరు కాని ఉద్యోగ సంఘాల నేతలు

ఏపీలో పీఆర్సీ అంశం రోజుకో మలుపు తీసుకుంటుంది. ఇవాళ కోర్టులో పీఆర్సీ పై వాదనలు విన్న కోర్టు పూర్తి ఆధారాలతో రావాలని సూచించింది. కాగా సమ్మె నోటీసిచ్చే ఉద్యోగ సంఘ నేతలను హాజరు కావాల్సిందిగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినా ఇప్పటి వరకు ఉద్యోగ సంఘాల నేతలేవ్వరూ కోర్టుకు హాజరు కాలేదు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో పీఆర్సీ సాధన సమితి భేటీ అయింది. హైకోర్టు ఆదేశాలతో సమ్మె నోటీసును ఏవిధంగా ఇవ్వాలనే దానిపై సాధన సమితి నేతలు తర్జన భర్జన పడుతున్నారు. ఏది ఏమైనా ఇవాళే సమ్మె నోటీసు ఇవ్వాలని భావిస్తోన్న ఉద్యోగ సంఘాలు.

Read Also: కరోనా ఎఫెక్ట్‌: ఈ నెలాఖరు వరకు 55 రైళ్లను రద్దు చేసిన రైల్వే శాఖ

అయితే అనుకున్న సమయాని కంటే కొంత జాప్యమయ్యే అవకాశం ఉంది. మరో వైపు హైకోర్టు ఆదేశాలపైన ఉద్యోగ సంఘాల నేతలు చర్చిస్తున్నారు. మరోవైపు సమ్మె నోటీసును సిద్ధం చేస్తున్నారు. మరో గంటలో సచివాలయానికి చేరుకోనున్న పీఆర్సీ సాధన సమితి నేతలు. మూడు పేజీలతో సమ్మె నోటీసును రూపొందించిన పీఆర్సీ సాధన సమితి. నిరవధిక సమ్మెకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు సమ్మె నోటీసులో వెల్లడించారు. ఉద్యమ కార్యాచరణ షెడ్యూలును సమ్మె నోటీసులో పీఆర్సీ సాధన సమితి పొందుపర్చింది.

Exit mobile version