Jogi Ramesh Cases: జోగి రమేష్‌కు వరుస షాక్‌లు..! మరిన్ని కేసులు నమోదు రంగం సిద్ధం..
- మాజీ మంత్రి జోగి రమేష్ పై మరిన్ని కేసులు నమోదుకు రంగం సిద్ధం..
- ఇప్పటికే నకిలీ మద్యం తయారీ కేసులో జోగి అరెస్ట్..
- తాజాగా అగ్రిగోల్డ్ భూముల కొనుగోలులో అక్రమాలపై కూడా కేసు నమోదుకు రెడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jogi Ramesh Cases: ఆంధ్రప్రదేశ్‌లో నకిలీ మద్యం తయారీ కేసు సంచలనం సృష్టించింది.. ఓవైపు మద్యం కుంభకోణం కేసుపై విచారణ సాగుతోన్న సమయంలో.. నకిలీ లిక్కర్ తయారీ కేసు రచ్చగా మారింది.. అయితే, ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ ప్రస్తుతం నెల్లూరు జిల్లా జైలులో రిమాండ్‌లో ఉండగా.. జోగి రమేష్‌పై మరిన్ని కేసులు నమోదుకు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది.. తాజాగా అగ్రిగోల్డ్ భూముల కొనుగోలులో అక్రమాలపై కూడా మాజీ మంత్రి జోగి రమేష్‌పై కేసు నమోదు చేయనుంది సీఐడీ.. అగ్రిగోల్డ్ భూముల అమ్మకాల్లో జోగి రమేష్ పాత్ర ఉన్నట్టు ఇప్పటికే గుర్తించారు సీఐడీ అధికారులు.. మరోవైపు పెడనలో కూడా భూములు క్రయ విక్రయాల్లో జోగి రమేష్‌పై పలు ఫిర్యాదులు అందాయని చెబుతున్నారు.. వీటిపై కూడా కేసు నమోదు చేసే అవకాశాలు సీఐడీ అధికారులు పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది..
Read Also: Social Media Ban: ఆస్ట్రేలియాలో సోషల్ మీడియా బ్యాన్.. ఆ రోజు నుంచే అమలు!
Also Read
కాగా, నకిలీ మద్యం తయారీ కేసులో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌తో పాటు ఆయన సోదరుడు జోగి రామును కూడా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం విదితమే.. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలో తెల్లవారుజామున జోగి రమేష్‌ను సిట్, పోలీసు, ఎక్సైజ్ సిబ్బందితో కూడిన ప్రత్యేక బృందాలు అదుపులోకి తీసుకున్నాయి.. కాగా, ఉద్దేశ్యపూర్వకంగానే తప్పుడు వీడియోలతో జోగి రమేష్‌ను ఈ కేసులో ఇరికించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.. గతంలో.. కూడా వైసీపీ నేతలను అరెస్ట్ చేసి.. వరుసగా కేసులు నమోదు చేసి జైలు నుంచి బయటకు రాకుండా చాలా రోజులు ఇబ్బంది పెట్టారని.. ఇప్పుడు జోగి రమేష్ విషయంలో కూటమి సర్కార్ అదే తీరుగా ముందుకు పోతుందని వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు..
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!