Minister Nimmala Ramanaidu: కృష్ణా డెల్టా రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి ఇబ్బందులను అధిగమించేందుకు పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మంత్రి నిమ్మల రామానాయుడు చేతుల మీదుగా నీటి విడుదల చేపట్టారు. మొదటి విడతలో పోలవరం కుడి కాలువ నుంచి 1000 క్యూసెక్కుల నీరు కృష్ణ డెల్టాకు విడుదల చేశారు. తాగు, సాగు నీటి అవసరాల మేరకు విడతలవారీగా నేటి విడుదల శాతాన్ని పెంచేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. పట్టిసీమ లిఫ్ట్ వద్ద ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అధికారులతో కలిసి నీటి విడుదల కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రి నిమ్మల రామానాయుడు.. ఇక, ఇటుకలకోట వద్ద పట్టిసీమ డెలివరీ పాయింట్ ప్రాంతాన్ని పరిశీలించనున్నారు.
Read Also: Hathras Stampede: యూపీ తొక్కిసలాటలో 116 మంది మృతి.. నేడు హత్రాస్కు సీఎం యోగి..
ఇక, మంగళవారం రోజు.. పోలవరం ప్రాజెక్టు, పట్టిసీమ, పురుషోత్తమ పట్నం, తాడిపూడి, పుష్కర ఎత్తిపోతల పథకాలను పరిశీలించారు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. ఎత్తిపోతల పథకాలకు నీటి విడుదలపై సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.. మరోవైపు.. గత ప్రభుత్వ పాలన పోలవరం ప్రాజెక్టుకు శాపంగా మారింది ఆయన ఆరోపించిన విషయం విదితమే.. పట్టిసీమను వట్టిసీమగా జగన్ ప్రభుత్వం చెప్పుకొచ్చింది.. ఇప్పుడు అదే పట్టిసీమ కృష్ణా డెల్టాకు బంగారు సీమగా మారింది.. టీడీపీ పాలనాలో సుమారు 300 టీఎంసీల నీటిని పట్టిసీమ ద్వారా ఇచ్చి 30 లక్షల ఎకరాల్లో సాగుకు ఇబ్బందు లేకుండా చూశామని.. సీఎంచంద్రబాబు ముందు చూపుతో పట్టిసీమ ఎత్తిపోతల రైతులకు సాగునీరు అందే పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు.. ఈ రోజు పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి పోలవరం కుడి కాలువలోకి నీటి విడుదల చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు.. మొదటి విడతగా వెయ్యి క్యూసేక్కుల నీటిని కుడికాలులోకి విడుదల చేశారు.. పట్టిసీమ లిఫ్ట్ వద్ద ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అధికారులతో కలిసి నీటి విడుదల కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రి నిమ్మల రామా నాయుడు.