Minister Nadendla Manohar: ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్.. ఆసుపత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఓపీ సేవలు సరిగా అందకపోవడంపై ఆసుపత్రి వర్గాలపై మండిపడ్డారు.. నడవలేని స్థితిలో ఉన్న రోగులకు వీల్ చైర్లు ఏర్పాటు చేయకపోవడంపై సిబ్బందిపై విరుచుకుపడ్డారు.. వైద్య సేవలు అందుతున్న తీరుపై రోగులను అడిగి వివరానికి తెలుసుకున్నారు మంత్రి.. ఇక, మగవారికి, మహిళలకు విడివిడిగా ఓపీ సేవలు అందేలా చూడాలని సూచించారు.. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో టాయిలెట్స్, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంపై అధికారులను నిలదీశారు.. నెల రోజుల్లో ఆస్పత్రిని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.. తన ఆకస్మిక పర్యటనలో.. ఆసుపత్రిలో వివిధ విభాగాలని పరిశీలించిన మంత్రి నాదెండ్ల మనోహర్.. అధికారులు, వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. మార్పులకు కీలక సూచనలు చేశారు.
Read Also: ISRO: కొత్త చరిత్ర సృష్టించిన ఇస్రో.. డాకింగ్ ప్రక్రియ విజయవంతం