Site icon NTV Telugu

CM Chandrababu: నేడు ఏలూరులో లబ్ధిదారులకు పెన్షన్లు అందించనున్న సీఎం చంద్రబాబు

Babu

Babu

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు ( డిసెంబర్ 1న) ఏలూరు జిల్లాలో పలు కార్యక్రమాలలో పాల్గొననున్నారు. ఉదయం 10.30 నిమిషాలకు ఉండవల్లిలోని తన నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి, 10.55 గంటలకు ఉంగుటూరు మండలం గొల్లగూడెంకు చేరుకోనున్నారు. అక్కడ ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమావేశం కానున్నారు. అనంతరం ఉదయం 11.10 గంటలకి గొల్లగూడెం నుంచి బయలుదేరి ఉంగుటూరు మండలం గోపినాథపట్నానికి చేరుకుంటారు.

Read Also: iBomma Ravi: ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ..!

ఇక, గోపినాథపట్నంలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను సీఎం చంద్రబాబు పంపిణీ చేయనున్నారు. ఆయా కుటుంబాలతో నేరుగా మాట్లాడనున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. ఉదయం 11. 40 నిమిషాలకు గోపినాథపట్నం నుంచి స్టార్ట్ అయి.. నల్లమాడలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు నల్లమాడ నుంచి బయలుదేరి గొల్లగూడెం చేరుకుని అక్కడ.. స్థానిక పార్టీ క్యాడర్ మీటింగ్లో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3. 35 గంటలకి హెలికాప్టర్‌లో ఉండవల్లికి తిరుగు పయనం అవుతారు.

Exit mobile version