NTV Telugu Site icon

CM Chandrababu: అది మన దెబ్బ..! పరదాలు కట్టుకుని తిరిగిన వ్యక్తి బురదలో దిగాడు..

Cbn

Cbn

CM Chandrababu: నా దెబ్బకు పరదాలు కట్టుకుని తిరిగిన వ్యక్తి బురదలో దిగే పరిస్థితికి వచ్చారు.. అంటూ వైఎస్‌ జగన్‌పై సెటైర్లు వేశారు సీఎం చంద్రబాబు నాయుడు.. ఏలూరులో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల విజయవాడలో అల్లకల్లోల పరిస్థితి ఏర్పడిందన్నారు.. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా అన్ని ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరింది.. ఏడాదిలో ఎంత వర్షం పడుతుందో అంత వర్షం విజయవాడలో రెండు రోజుల్లో కురిసింది.. బుడమేరుకు గండ్లు పడితే వాటిని పూడ్చలేని పరిస్థితి గత ప్రభుత్వానిది అంటూ మండిపడ్డారు.. టీడీపీ హయాంలో నిధులు కేటాయించిన వాటిని ఉపయోగించుకోలేని పరిస్థితి గత ప్రభుత్వానిది.. రాజకీయ పార్టీ కార్యాలయాల పైన దాడులు చేస్తారు, అరెస్టు చేస్తే నిరసన చేస్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: Rohit Sharma-MI: ముంబై ఇండియన్స్‌తో రోహిత్ శర్మ ప్రయాణం ముగిసినట్లే!

నేను ప్రతిరోజు బురదలో దిగాను.. నేను దిగాను కాబట్టి అధికారులంతా సమన్వయంతో పనిచేశారు అని తెలిపారు సీఎం చంద్రబాబు.. ప్రజలంతా శభాష్ అనే విధంగా అడ్మినిస్ట్రేషన్ పనిచేస్తుంది.. నా దెబ్బకు పరదాలు కట్టుకుని తిరిగిన వ్యక్తి బురదలో దిగే పరిస్థితికి వచ్చారని వ్యాఖ్యానించారు. ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు వారి ఆస్తులకు నష్టం జరగకుండా చూడాలి… నా దగ్గర డబ్బులు లేవు ఖజానా ఖాళీ రోజు రోజుకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి.. ఆదాయం పడిపోయింది, 10 లక్షల కోట్ల రూపాయలకి వడ్డీ అసలు కట్టాలి.. వచ్చే ఆదాయం వడ్డీకి సరిపోయేలా చేశారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వరదల కారణంగా నష్టపోయిన వారి రైతులకు ఎకరాకు పది వేలు ఇస్తాను.. అది కూడా తక్కువే.. భారీ వర్షాలతో రైతులు ఎక్కువ నష్టపో పోయారు.. తమ్మిలేరు, ఎర్రకాలువ ఈ ప్రాంత వాసులకు ఎక్కువ నష్టం తీసుకొస్తున్నాయి.. ఉప్పుటేరు సమస్య ఎప్పటినుంచో ఇబ్బందులు చేస్తోంది.. తీసుకు వస్తుందన్నారు.

Read Also: Devara Part 1: ‘దేవర’ కొత్త కథ కాదు.. కానీ కొత్త కొరటాలను చూస్తారు!

అయితే, పోలవరం పూర్తయి ఉంటే రాష్ట్రం చాలా వరకు సుభిక్షంగా ఉండేదన్నారు చంద్రబాబు.. పోలవరం రాష్ట్రానికి ఒక వరం.. పోలవరం ద్వారా నదులు అనుసంధానం చేస్తే రాష్ట్రంలో కరువు ఉండదు. సోమవారం పోలవరంగా చేసుకుని పనులు పరుగులు పెట్టించాము.. టీడీపీ హయంలో 72% పనులు పూర్తయ్యాయి.. టీడీపీ అధికారం కొనసాగి ఉంటే ఈపాటికి ప్రాజెక్టు పూర్తయి జాతికి అంకితం చేసేవాళ్లం అన్నారు. ఏదేమైనా పోలవరాన్ని పూర్తిచేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది.. వరదలు తుఫాన్లు ఎప్పుడూ ఉంటాయి, తుఫాన్‌, వరదలు వచ్చినప్పుడు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు.. టెక్నాలజీలో వచ్చిన పెను మార్పులను ఉపయోగించుకుని తుఫాన్‌లు వరదల సమయంలో సహాయక చర్యలు చేపడుతున్నాం. వరదలు వస్తే తీసుకోవలసిన జాగ్రత్త చర్యలపై ముందే సిద్ధంగా ఉంటాం.. సాగునీటి సంఘాలను త్వరలో ఏర్పాటు చేస్తాం.. ఉప్పుటేరు నుంచి నేను దిగువకు వెళ్లేందుకు ఏం చేయాలో ఆలోచన చేసి అమలు చేస్తాం అన్నారు సీఎం చంద్రబాబు..

Read Also: kanchana4 : కాంచనా 4లో దెయ్యంగా నటించనున్న పొడుగుకాళ్ల సుందరి..

శనివారపు పేట కాజ్ వే స్థానంలో 15 కోట్లతో ఎస్సీ నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం అన్నారు ఏపీ సీఎం.. పెదపాడులో లోయర్ ట్రైన్లు రిపేరు చేపించేందుకు చర్యలు తీసుకుంటాం.. ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది.. రాజకీయాలకు అతీతంగా పరిపాలన సాగిస్తాం.. సుపరిపాలన అందించాలని లక్ష్యంతో ఎన్డీఏ ముందుకు వెళ్తోంది.. నూటికి 70 మంది కౌలు రైతులు ఉన్నారు.. పెట్టుబడి పెట్టి నష్టపోయిన కవులు రైతులను ఆదుకుంటాం.. ఈ ప్రభుత్వాన్ని నడిపించే బాధ్యత గెలిపించిన ప్రజలదే.. రాత్రింబవళ్లు పనిచేసే ప్రజల కష్టాలు తీరుస్తాం అన్నారు. బుడమేరు ఆక్రమణలకు గురి చేశారు.. తప్పుడు రిజిస్ట్రేషన్లు చేసి ఎక్కడికి అక్కడ బిల్డింగులు కట్టారు.. నీళ్లు పోవలసిన బుడమేరును అక్రమ కట్టడాలకు అడ్డాగా మార్చారు.. ప్రకృతి మనల్ని చిన్నచూపు చూసినప్పుడు ఇలాంటి వరదలు వస్తాయి.. గత పాలకులు చేసిన పాపాలు ఇప్పుడు శాపాలుగా మారాయి అంటూ మండిపడ్డారు సీఎం చంద్రబాబు నాయుడు..

Show comments