NTV Telugu Site icon

Polavaram Project: పోలవరం నిర్వాసితుల సమస్యలు తెలుసుకున్న సీఎం చంద్రబాబు..

Polavaram

Polavaram

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంకి ఏపీ సీఎం చంద్రబాబు చేరుకుని ఏరియల్ వ్యూ ద్వారా ప్రాజెక్టు పనులను పరిశీలించారు. అనంతరం పోలవరం వ్యూ పాయింట్ నుంచి ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని సైతం పరిశీలించారు. ఇక, ఈ సందర్భంగా పోలవరం నిర్వాసితులతో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరు అయ్యారు. ఇక, గత కొన్నేళ్లగా ఎదురైన సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబుకి పోలవరం నిర్వాసితులు వివరించారు.

Read Also: Gold Rate Today: పసిడి ప్రియులకు షాక్.. వరుసగా రెండోరోజు పెరిగిన బంగారం ధరలు!

అయితే, వరదల సమయంలో ఇల్లు ఖాళీ చేసిన వారిని నాన్ రెసిడెంట్ గా చూపించి పరిహారం ఇవ్వలేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి పోలవరం నిర్వాసితులు తెలియజేశారు. గత ప్రభుత్వ హయంలో నిర్వాసితులను తెలంగాణలో కలపాలని రోడ్డెక్కినట్టు గుర్తు చేశారు. తమను ఈ ప్రభుత్వమైన అదుకోవాలని వారు కోరారు.