Chintamaneni vs AbbayaChowdary: ఏలూరు జిల్లాలోని దెందులూరు నియోజక వర్గంలో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి వర్సెస్ ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ సందర్భంగా చింతమనేని మాట్లాడుతూ.. కొంతమంది పోయిన ఉనికిని కాపాడుకోవడానికి సంచలనం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. చట్టం ప్రకారం కూటమి ప్రభుత్వం పని చేస్తుంది.. కావాలని గొడవ చేస్తే చూస్తూ ఊరుకోనే పరిస్థితి లేదు అని వార్నింగ్ ఇచ్చారు. తప్పుంటే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ చెప్పారు.. ఈ విషయాన్ని ప్రభుత్వం, సీఎం, డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకు వెళ్తాను.. నేను బరస్ట్ అయిన మాట వాస్తవమే అని చింతమనేని ప్రభాకర్ తెలిపారు.
Read Also: Vallabhaneni Vamsi Wife: పోలీస్స్టేషన్ లోపలికి వంశీ భార్యను అనుమతించని పోలీసులు..
అయితే, నా కారుకు కారు అడ్డం పెట్టి, డ్రైవర్ ను, మా వాళ్ళను తిడితే చూస్తూ కూర్చుంటామా అని చింతమనేని అన్నారు. నా కారుకు ఎందుకు మీ కారు అడ్డం పెట్టారు.. మీ ఉద్ధేశ్యం ఏమిటీ అని ప్రశ్నించారు. వాళ్లు ప్రజల సొమ్ముతో తిరుగుతున్నారు.. దొంగల పార్టీ వారిది అంటూ విమర్శించారు. మీకు సంస్కారం లేదు కాబట్టి.. సంస్కార హీనుడిగా ప్రవర్తించావు.. ఇది ప్రజాస్వామ్యం.. ఖబడ్దార్.. మీరు ఏదైనా చేస్తుంటే చూస్తూ కూర్చుంటామా.. నేను డ్రైవర్ ను మందలించిన తరువాతే వారు కారు పక్కకు తీసారు.. నేను ఎందుకు తిట్టాల్సి వచ్చింది.. నా కారుకు కెమెరా ఉంది.. కావాలంటే విజువల్స్ ఇస్తాను అన్నారు. జగన్ పుణ్యమా ఎమ్మెల్యే అయ్యావ్.. నీది, నీ ఫ్యామిలీది ఒక బతుకా అంటూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిపై చింతమనేని ప్రభాకర్ తీవ్రంగా మండిపడ్డారు.
Read Also: Chilkur Balaji Temple Priest: అర్చకుడు రంగరాజన్‌పై దాడి కేసు.. మరో ఏడుగురి అరెస్ట్
ఇక, దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ.. దెందులూరు నియోజక వర్గంలో విధ్వంస పాలన కొనసాగుతుంది అన్నారు. వైసీపీ కార్యకర్తలు, నాయకులపై చింతమనేని ప్రభాకర్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నన్ను నా కుటుంబాన్ని అంత మొందించాలని కుట్ర జరుగుతున్నట్టుగా అనుమానం కలుగుతుంది అని పేర్కొన్నారు. కార్ పార్కింగ్ దగ్గర ఏర్పడిన చిన్న వివాదంలో మా డ్రైవర్, కార్యకర్తలపై చింతమనేని దాడికి పాల్పడ్డారు.. కొల్లేరులో అవినీతికి పాల్పడ్డాడని శ్రీపర్రు గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులను తన ఇంటికి పంపి డప్పులు కొట్టించి డాన్స్ లు చేపిస్తున్నారు.. చింతమనేని ఒక ప్రజా ప్రతినిధిననే సంగతి మరచి బూతులు తిట్టడం మంచి సాంప్రదాయం కాదు అని అబ్బయ్య చౌదరి వెల్లడించారు.