NTV Telugu Site icon

Call Money Danda: కాల్ మనీ దందా.. వేలల్లో అప్పులు ఇచ్చి లక్షల్లో వసూళ్లు.. ఊరు వీడుతున్న బాధితులు..!

Call Money

Call Money

Call Money Danda: ఏలూరులో కాల్ మనీ దందాలు వరుసగా వెలుగు చూస్తున్నాయి. ఒక్కొక్కరిగా బయటికి వస్తున్న బాధితులు తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారు. తీసుకున్న అప్పుకి పదింతలు చెల్లించినా మహిళలకు లైంగిక వేధింపులు ఆగడంలేదని ఆవేదన చెందుతున్నారు.అధిక వడ్డీలు చెల్లించలేక, అప్పులు తీర్చలేక ఊరు వదిలి వెళ్ళిపోతున్న బాధితులు గతంలో పోలీసులను ఆశ్రయించినా న్యాయం జరగలేదని బాధితుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఎస్పీకి పిర్యాదు చేసేందుకు సిద్ధం అయిన బాధితులు ప్రజా ప్రతినిధులను కలుస్తూ తమగోడు వెళ్ళపోసుకుంటున్నారు. ఏలూరులో అధిక వడ్డీలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న బాధితులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణను కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకొచ్చారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే పేదల రక్తాన్ని పీల్చుకు తినే కాల్ మనీ గ్యాంగ్ లకు తమ ప్రభుత్వం బుద్ధి చెబుతుందని స్పష్టం చేశారు.

Read Also: Mthun Chakraborty : లెజండరీ యాక్టర్.. మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు

ఏలూరు పవర్పేటలోని ఎమ్మెల్యే కార్యాలయానికి కాల్ మనీ బాధితులు సుమారు 60 మంది వరకు చేరుకుని తమకు జరిగిన అన్యాయాన్ని ఎమ్మెల్యే బడేటి చంటి కి వివరించారు. 2021 నుంచి జరుగుతున్న అక్రమాలపై ఎన్నిసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన వారు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే బడేటి బాధితులు అందరికీ న్యాయం జరిగే విధంగా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. పేదల అవసరాలను ఆసరాగా చేసుకుని అధిక వడ్డీలు వసూలు చేసే గ్యాంగ్ లపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బడేటి క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యే బడేటి చంటి ని కలిసిన కాల్ మనీ బాధితులు, తమకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని..కాల్ మనీ పేరుతో మేడపాటి సుధాకర్ రెడ్డి అరాచకాలు ఇప్పుడిప్పుడే వెలుగు చూస్తున్నాయని ..మధ్యతరగతి కుటుంబాలనే టార్గెట్గా చేసుకుని కాల్ మనీ వేధింపులకు పాల్పడుతున్న మేడపాటి సుధాకర్ రెడ్డి, అతని అనుచరులపై చర్యలు ఉండేలాగా కృషి చేస్తామన్నారు.కాల్ మనీ బాధితులకు న్యాయం జరిగేలాగా తగు చర్యలు తీసుకొని, కాల్ మనీకి పాల్పడిన వారికి శిక్షపడేలా చూస్తామని హామీ ఇచ్చిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఈ వ్యవహారంలో బాధితులకు న్యాయం చేయడంతో పాటు, చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. కాల్ మనీ వ్యవహారంలో ఇప్పటికే బాధితులుగా మారిన వారంతా జిల్లా ఎస్పీ తో పాటు కలెక్టర్ ను కలిసి తమ గోడు వెళ్ళబోసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కాల్ మనీ గ్యాంగ్ అరాచకాలు తట్టుకోలేక ఊరు వదిలి వలసపోయిన బాధితులు తిరిగివచ్చి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఏలూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంకా ఎంతమంది బాధితులు బయటికి వస్తారు.. ఇంకెన్ని అన్యాయాలు వెలుగు చూస్తాయి అనేది సస్పెన్స్ గా మారింది.

Show comments