AP Crime: పోలీసుల పేరుతో బురిడీ కొట్టించే ప్రయత్నం.. షాకిచ్చిన వ్యాపారి..!
- ఏలూరు జిల్లా ద్వారకాతిరుమలలో పోలీసుల పేరుతో మోసం..
- ఫోన్ పే చేస్తే కానిస్టేబుల్ ద్వారా క్యాష్ పంపిస్తానని వ్యాపారులను నమ్మబలికి బురిడీ..
- కేటుగాడికి షాకిచ్చిన వ్యాపారి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: ఏలూరు జిల్లా ద్వారకాతిరుమలలో ఘరానా మోసానికి తెరలేపాడు ఓ కేటుగాడు. పోలీసునని చెప్పి డబ్బులు అవసరమని తనకు ఫోన్ పే చేస్తే కానిస్టేబుల్ ద్వారా క్యాష్ పంపిస్తానని వ్యాపారులను నమ్మబలికి బురిడీ కొట్టించాలనుకున్నాడు. అయితే వ్యాపారస్తులు చాకచక్యంగా ప్రవర్తించడంతో కేటుగాడి వలకు చిక్కలేదు. ద్వారకాతిరుమలలో ఓ కేటుగాడు వ్యాపారులతోపాటు , ఓ ఉద్యోగిని మోసగించి డబ్బులు కాజేయడానికి ప్రయత్నించాడు. నెలరోజుల క్రితం ఓ గుర్తు తెలియని వ్యక్తి తాను పోలీసునని చెప్పి, తనకు డబ్బులు అవసరమని రూ.45 వేలు ఫోన్ పే చేయమని, కానిస్టేబుల్ ద్వారా నగదు పంపిస్తానని చెప్పాడు. దాంతో వ్యాపారి ఆ వ్యక్తి మాటలు నమ్మి రూ.45 వేలు ఫోన్ పే చేశాడు. అయితే, ఆ తర్వాత ఆ నెంబర్‌కు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. దాంతో మోసపోయానని గ్రహించినా చేసేదిలేక సైలెంట్ గా ఉండిపోయాడు..
Read Also: Ram Charan: రామ్ చరణ్‌తో సెల్ఫీ తీసుకోవాలనే కోరిక తీరింది: మెల్బోర్న్ మేయర్
Also Read
- Alla Nani No More: మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత..
- Chandrababu on Mega DSC: డీఎస్సీపై వైసీపీ ఆందోళనలకు చంద్రబాబు కౌంటర్.. కీలక వ్యాఖ్యలు
- CM Chandrababu: వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్.. గంజాయి, రౌడీయిజంపై సంచలన వ్యాఖ్యలు
- Nuzvid Love Marriage Twist: ప్రేమ వివాహం తర్వాత ట్విస్ట్.. భార్యను అప్పగించేందుకు రూ.12 లక్షలు డిమాండ్?
అయితే తాజాగా ఆ కేటుగాడు ద్వారకాతిరుమలలో ఫంక్షన్ హాల్ యజమానికి, సొసైటీ సెక్రటరీ కాల్ చేశాడు. తను ద్వారకాతిరుమల ఏఎస్ఐ పనిచేస్తున్నానని, సుబ్రహ్మణ్యం అనే కానిస్టేబుల్ కు యాక్సిడెంట్ అయిందని, హాస్పిటల్ నిమిత్తం డబ్బులు అవసరమని, రూ. 50 ఫోన్ పే చేస్తే మరో కానిస్టేబుల్ తో తనకు నగదు పంపిస్తానని నమ్మబలికాడు. గత అనుభవాలతో అప్రమత్తమైన సొసైటీ సెక్రటరీ కిషోర్ ముందు నగదు పంపించండి ఫోన్ పే చేయిస్తానని చెప్పడంతో కేటుగాడు కంగుతున్నాడు. అయితే, ఇలాంటి వారిపై సైబర్ క్రైమ్ పోలీసులు చర్యలు తీసుకోవాలని స్థానిక వ్యాపారులు కోరుతున్నారు.. మరోవైపు.. సైబర్ నేరగాళ్లు ఏ విధంగానైనా ముగ్గులోకి దింపి.. డబ్బులు కాజేసే అవకాశం ఉంటుందని అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు..
తాజావార్తలు
-
Hyderabad: రూ.10 కోసం ప్రాణం తీశారు.. హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్ దారుణ హత్య
-
Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్డేట్.. రేపే ‘నారాయణమ్మ’ మాస్ సాంగ్ రిలీజ్!
-
Mohit Sharma: హార్దిక్ పాండ్యాకు సరితూగడు.. నితీష్ రెడ్డిపై అంచనాలు వద్దు!
-
Apple iPhone Users: ఆపిల్ ఐఫోన్ ఉంటే డబ్బులు.. ఎవరు క్లెయిమ్ చేసుకోవచ్చు? ఎలా దరఖాస్తు చేయాలి?
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
ట్రెండింగ్
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!