Site icon NTV Telugu

Elephant Walking: వాకింగ్ కి వచ్చిన ఏనుగు.. ఏంటా కథ?

Elephant

Elephant

ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనం వాకింగ్ చేస్తుంటాం. రోజూ ఉదయం పూట సమీపంలోని పార్క్‌కి వెళ్ళి అరగంటో.. గంటో వాకింగ్, ఎక్సర్ సైజ్‌ లు చేసి వస్తాం. కానీ వివిధ జంతువులు వాకింగ్ చేయడం చూశారా. చిత్తూరు జిల్లాలో పొద్దు పొద్దున్నే వాకింగ్ కు వచ్చిన ఏనుగు.. ఇప్పుడు వైరల్ అవుతోంది. పలమనేరు మండలం పెంగరగుంట గ్రామ పొలాల్లోకి వచ్చిన ఒంటరి ఏనుగు హల్ చల్ చేసింది.

మనుషులు వాకింగ్ చేసిన మాదిరి పొలాలు రోడ్లపై అటు ఇటు తిరుగుతూ వాకింగ్ చేస్తూ కనిపించింది. మిగతా ఏనుగుల తరహాలో కాకుండా ఈ ఏనుగు ఎవరికీ హాని చేయలేదు. తన దారిన తాను నడుచుకుంటూ అలా వెళ్ళిపోయింది. గతంలో జనంలోకి వచ్చిన ఏనుగును అడవిలోకి తిరిగి తరమడానికి గ్రామస్తులు ప్రయత్నాలు చేశారు. గత నెలలో గజరాజు ఓ వ్యక్తిపై దాడి చేసి చంపేసిన సంగతి విదితమే. ఇలా పగలూ రాత్రీ తేడా లేకుండా ఏనుగులు పంట పొలాలపై పడుతున్నాయని ఏక్షణమైనా గ్రామాల్లో కూడా వచ్చేస్తాయని గ్రామస్తులు అంటున్నారు.

Prakash Goud: దళిత బంధుతో దళిత కుటుంబాల్లో వెలుగులు

Exit mobile version