NTV Telugu Site icon

Krishna: విద్యుదాఘాతానికి గురైన లారీ క్లీనర్‌.. పరిస్థితి విషమయం

Untitled 1

Untitled 1

Krishna: ప్రమాదం ఎప్పుడు ఎక్కడ ఏ రూపంలో పొంచి ఉంటుందో ఎవరు చెప్పలేరు. నిత్యం చేసే పని అయినా ఒక్కోసారి ఆ పనిని చేస్తున్న సందర్భంలో అనుకోకుండా ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇలా కొందరు వ్యక్తులు వృత్తిలో భాగంగా పనులు చేస్తూ ప్రమాదానికి గురైన ఘటనలు కోకొల్లలు. తాజాగా అలాంటి ఘటనే మరోసారి వెలుగు చూసింది. లారీపై టార్పాలిన్‌ కడుతూ క్లీనర్‌ విద్యుదాఘాతానికి గురైయ్యారు. ఈ ఘటన గుడివాడలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. తమిళనాడు రాష్ట్రం లోని తిరువళ్లూరు జిల్లా లోని అనుప్పంపట్టు మండలం పొన్నేరు గ్రామ నివాసి విఘ్నేష్‌ (40) కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తనకు వరుసకు సోదరుడు అయినటువంటి నాగం మును స్వామి గుడివాడ ధాన్యం లోడు పని ఉందని రావాల్సిందిగా విఘ్నేష్‌ ను పిలిచారు.

Read also:Cyclone Michaung LIVE UPDATES: ముంచుకొస్తున్న మిచౌంగ్ తుఫాన్‌.. లైవ్ అప్‌డేట్స్‌

పని దొరికిందని.. వెళ్తే నాలుగు రూపాయలు వస్తాయని అనుకున్న విఘ్నేష్‌ తనకు వరుసకు సోదరుడైనటువంటి నాగం మును స్వామితో కలిసి గుడి వాడకు చేరుకున్నారు. కాగా ఆదివారం పామర్రు రోడ్‌లోని రామనపూడి సమీపంలో ధాన్యం లోడుకు పట్ట కప్పుతుండగా లారీ పైన ఉన్న విద్యుత్తు తీగలు తలకు తగిలాయి. దీనితో అతనికి జుట్టు కాలిపోయి తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే స్పందినచిన స్థానికులు 108 కి కాల్ చేయగా.. హుటాహుటీన అంబులెన్స్‌ ఘటన స్థలానికి చేరుకుంది. అనంతరం స్థానికులు అంబులెన్స్‌ లో విఘ్నేష్‌ ను ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడి వైద్యుల సూచనల మేరకు మెరుగైన చికిత్స కోసం విజయవాడ తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేయాల్సి ఉంది.