Site icon NTV Telugu

Minister Vishwaroop: త్వరలోనే తిరుమలకు ఎలక్ట్రిక్ బస్సులు

Electric Bus

Electric Bus

రాష్ట్రంలో నూతనంగా కాలుష్యరహిత ఎలక్ట్రిక్ బస్సులను తీసుకువస్తామని రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ వెల్లడించారు. కోనసీమ జిల్లా మామిడికుదురులో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల నుంచి తిరుపతికి నడిపేందుకు పైలట్ ప్రాజెక్టుగా 100 ఎలక్ట్రిక్ బస్సులను సిద్ధం చేస్తున్నట్లు మంత్రి విశ్వరూప్ తెలిపారు. అనంతరం దశల వారీగా విశాఖపట్నం, విజయవాడతో పాటూ ప్రధాన నగరాల మధ్య ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతామని పేర్కొన్నారు.

మరోవైపు రాష్ట్రంలో రవాణా వ్యవస్థను పటిష్టం చేస్తామని మంత్రి విశ్వరూప్ అన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ 78 శాతానికి పెరిగేలా అధికారులు, సిబ్బంది శ్రమించాలని ఆయన సూచించారు. డీజిల్‌ ధరల పెరుగుదల సంస్థకు మోయలేని భారంగా మారిందని.. ఈ పరిస్థితుల్లోనే సెస్‌ విధించామని, ప్రజలు అర్థం చేసుకున్నా ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి విశ్వరూప్ మండిపడ్డారు.

Tirumala: టీటీడీ స్క్రీన్ పై సినిమా పాటలు.. శ్రీవారి భక్తులు షాక్‌

Exit mobile version